Gaganyaan Mission: తొలి మానవ సహిత అంతరిక్ష యాత్రకు ఇస్రో సన్నాహాలు

ISRO Is Preparing For The First Manned Space Mission
x

Gaganyaan Mission: తొలి మానవ సహిత అంతరిక్ష యాత్రకు ఇస్రో సన్నాహాలు

Highlights

Gaganyaan Mission: ఫ్లైట్ టెస్ట్ వెహికల్ అబార్ట్ మిషన్-1 కోసం సన్నాహాలు ప్రారంభం

Gaganyaan Mission: భారత తొలి మానవ సహిత అంతరిక్ష యాత్ర గగన్‌యాన్‌కు సన్నాహాలు ముమ్మరంగా సాగుతున్నట్లు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ తెలిపింది. ఫ్లైట్ టెస్ట్ వెహికల్ అబార్ట్ మిషన్-1 కోసం సన్నాహాలు ప్రారంభించింది. ఈ యాత్ర మధ‌్యలో వ్యోమగాములు సురక్షితంగా తప్పించుకునేందుకు వీలుగా పొందుపర్చనున్న అబార్ట్ మిషన్ వన్ పనులు కొనసాగుతున్నాయని వెల్లడించింది. దీనికి సంబంధించిన ఫొటోలను ఇస్రో ట్వీట్ చేసింది. ఈ ప్రాజెక్టులో భాగంగా ఇద్దరు వ్యోమగాములను మూడు రోజుల పాటు భూమి నుంచి 400 కిలోమీటర్ల వృత్తాకార కక్ష్యలోకి తీసుకెళ్తారు. ఇక అక్టోబర్ నెలాఖరు వరకు ప్రాజెక్టును పూర్తిచేసేందుకు ఇస్రో కంకణం కట్టుకుంది.


Show Full Article
Print Article
Next Story
More Stories