వరుస ప్రయోగాలకు సన్నాహాలు మొదలుపెట్టిన ఇస్రో

వరుస ప్రయోగాలకు సన్నాహాలు మొదలుపెట్టిన ఇస్రో
x
Highlights

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో వరుస ప్రయోగాలకు సన్నాహాలు ప్రారంభించింది. లాక్డౌన్ నేపథ్యంలో మూతబడిన శ్రీహరికోటలోని షార్ కేంద్రంలో తిరిగి ప్రయోగాల సన్నాహాలు మొదలు పెట్టింది.

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో వరుస ప్రయోగాలకు సన్నాహాలు ప్రారంభించింది. లాక్డౌన్ నేపథ్యంలో మూతబడిన శ్రీహరికోటలోని షార్ కేంద్రంలో తిరిగి ప్రయోగాల సన్నాహాలు మొదలు పెట్టింది.జీఎస్ఎల్వీ సిరీస్ లో ఇప్పటికే వాయిదా పడిన ప్రయోగాలను తిరిగి మొదలు పెట్టేందుకు ఇస్రో కార్యాచరణ కు శ్రీకారం చుట్టింది.

భారత అంతరిక్ష పరి శోధన సంస్థ శ్రీహరికోట రాకెట్ కేంద్రంలో జీఎస్ఎల్వీ-ఎఫ్ 10 వాహకనౌక విడదీత కార్యక్రమాన్ని మొదలు పెట్టింది. గత మార్చి ఐదున జీఎస్ఎల్వీ ఎఫ్-10 ప్రయోగం చేసేందుకు సైంటిస్ట్ లు నిర్ణయించారు. మార్చి నాలుగో తేది మధ్యాహ్నం కౌంట్ డౌన్ కు పది నిమిషాల ముందు టెక్నికల్ ప్రాబ్లమ్ రావడంతో ప్రయోగాన్ని వాయిదా వేశారు.

కరోనా ప్రభావం, లాక్ డౌన్ సడలింపులతో ఇస్రోలో ప్రయోగాలకు బ్రేక్ పడింది. ఇప్పుడు లాక్ డౌన్ సడలింపులతో మళ్లీ ప్రయోగాలకు ఇస్రో సిద్ధమవుతోంది. తిరువనంతపురంలోని విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ నుంచి శాస్త్రవేత్తలు షార్ కు వచ్చారు. మార్చిలో ఆగిపోయిన జీఎస్ఎల్వీ ప్రయోగాలపై శాస్త్రవేత్తలు దృష్టి పెట్టారు. వాహక నౌకలోని ఈబీలను, క్రయోదశలను విడదీశారు. జీఎస్ రెండో దశను వేరు చేయనున్నారు. జీఎస్ఎల్వీ ప్రయోగం పూర్తికాగానే పిఎస్సెల్వి సిరీస్ ప్రయోగాలకు ఇస్రో ఏర్పాట్లు చేస్తోంది.




Show Full Article
Print Article
More On
Next Story
More Stories