ఖుష్బూ యాక్సిడెంట్ వెనక కుట్రకోణం ఉందా?

ఖుష్బూ యాక్సిడెంట్ వెనక కుట్రకోణం ఉందా?
x

Khushboo accident behind secret (file image)

Highlights

కోలీవుడ్ హీరోయిన్, బీజేపీ మహిళానేత ఖుష్బూ కారు ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకొని ప్రాణాలతో బయటపడ్డారు. చెన్నైలో ఆమె కారును ఓ భారీ కంటైనర్ ఢీ...

కోలీవుడ్ హీరోయిన్, బీజేపీ మహిళానేత ఖుష్బూ కారు ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకొని ప్రాణాలతో బయటపడ్డారు. చెన్నైలో ఆమె కారును ఓ భారీ కంటైనర్ ఢీ కొట్టింది. అయితే సరైన సమయంలో కారులో ఉన్న ఎయిర్ బెలూన్ తెరుచు కోవడంతో పెను ప్రమాదం నుండి తృటిలో కుష్బూ తప్పించుకున్నారు. ఈ ప్రమాదంపై ఖుష్బూ ట్వీట్ చేశారు. జరిగిన కారు ప్రమాదంలో తనకు ఏమీ కాలేదని అభిమానుల ఆశీస్సులు ఆ దేవుడి దీవెనలతో ప్రమాదం నుండి క్షేమంగా బయటపడ్డానని ఖుష్బూ తెలిపారు.

మరోవైపు చెన్నైలోని మెల్మరువతుర్ సమీపంలో జరిగిన ఈ ప్రమాదంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఖుష్బూ కారును ఢీ కొట్టిన కంటైనర్ రాంగ్ రూట్లో వచ్చినట్లు కుష్బూ వెల్లడించారు. దీంతో కావాలనే కుష్బూ కారును కంటైనర్ ఢీ కొట్టిందా అన్న సందేహాలు తలెత్తుతున్నాయి. ఈ ఘటనలో ప్రమాదానికి కారకుడైన కంటైనర్ డ్రైవర్‎ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ప్రమాదానికి కారణమైన కంటైనర్ వాషింగ్ మెషీన్ల లోడుతో పుదుచ్చేరి వైపు వెళుతుందన్న పోలీసులు పూర్తి విచారణ అనంతరం వాస్తవాలు తెలుస్తాయని వివరించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories