Top
logo

భారత్‌లో మళ్లీ పూర్తిస్థాయి లాక్‌డౌన్ తప్పదా..?

భారత్‌లో మళ్లీ పూర్తిస్థాయి లాక్‌డౌన్ తప్పదా..?
X

భారత్‌లో మళ్లీ పూర్తిస్థాయి లాక్‌డౌన్ తప్పదా..?

Highlights

భారత్‌లో మళ్లీ పూర్తిస్థాయి లాక్‌డౌన్ తప్పదా..? గత మూడు రోజులుగా పెరుగుతున్న కేసులు ఎలాంటి...

భారత్‌లో మళ్లీ పూర్తిస్థాయి లాక్‌డౌన్ తప్పదా..? గత మూడు రోజులుగా పెరుగుతున్న కేసులు ఎలాంటి సంకేతాలిస్తున్నాయి..? ముఖ్యంగా ఆ ఐదు రాష్ట్రాల్లో కోవిడ్ మహమ్మారి కల్లోలం రేపుతుంటే దేశంలోకి తాజాగా ఎంట్రీ ఇచ్చిన మరో రెండు కొత్త వేరియంట్లు మరింత కలవరానికి గురి చేస్తున్నాయి. అసలు కరోనా మళ్లీ విజృంభించడానికి కారణమేంటి..?

దేశంలో కరోనా మహమ్మారి మళ్లీ పంజా విసురుతోంది. గత మూడ్రోజులుగా కేసులు గణనీయంగా పెరుగుతుండడంతో దేశంలోని పలు రాష్ట్రాలు కట్టుదిట్టమైన చర్యలను చేపట్టాయి. అయితే కొత్త కరోనా కేసుల పెరుగుదల ఇలాగే కొనసాగితే అనేక రాష్ట్రాలు మళ్లీ లాక్ డౌన్ లోకి వెళ్లడం ఖాయంగా కనిపిస్తోంది. మహారాష్ట్రలో గత 3 రోజులుగా రోజుకు ఆరు వేల కేసులు నమోదవుతుంటే కేరళలో ఆ సంఖ్య 9 వేలుగా ఉంది. దీంతో ఆ రాష్ట్రాల్లో మళ్లీ పూర్తిస్థాయి లాక్‌డౌన్ తప్పదన్న వాదనలు వినిపిస్తున్నాయి.

మరోవైపు భారత్‌ను కొత్త కరోనా వేరియంట్లు కలవరపెడుతున్నాయి. మహారాష్ట్ర, తెలంగాణ, కేరళలో రెండు కొత్త వేరియంట్లను శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ నేపథ్యంలో దేశంలో కరోనా పరిస్థితులపై ప్రధాని మోడీ కీలక సమీక్ష నిర్వహించారు. కొత్త వేరియంట్ల నిర్థారణతో దేశవ్యాప్తంగా క్లస్టర్ టెస్టింగ్ నిర్వహించాలని ఈ సమీక్షలో నిర్ణయం తీసుకున్నారు.

అటు మహారాష్ట్ర, కేరళ, తమిళనాడు, కర్ణాటక, పంజాబ్ కరోనా కొత్త కేసులకు తాజా హాట్ స్పాట్లుగా మారాయి. ఫలితంగా ఇప్పటికే మహారాష్ట్ర ప్రభుత్వం విదర్భ ప్రాంతంలో పాక్షికంగా లాక్ డౌన్ విధించింది. అమరావతి, అకోలా వంటి జిల్లాల్లో రాత్రి పూట కర్ఫ్యూను విధించింది. కర్ణాటక-కేరళ రాష్ట్రాలు సరిహద్దులను కట్టుదిట్టం చేశాయి. మహారాష్ట్ర విదర్బ ప్రాంతాల్లో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల పెరుగుదలతో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. సరిహద్దులపై నిఘా పెట్టింది.

ఇదిలా ఉంటే కేరళలో కరోనా కేసులు పెరిగిపోతుండటంతో కర్ణాటక కీలక నిర్ణయం తీసుకుంది. కేరళతో ఉన్న 13 సరిహద్దులను మూసివేసింది. కేరళ నుంచి వచ్చే అన్ని రహదారులను క్లోజ్ చేసింది. అయితే కర్ణాటక తీసుకున్న నిర్ణయంపై కేరళ మండిపడుతోంది. కర్ణాటక ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటుందని దీనివల్ల కేరళ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని పేర్కొంది.

ఇక ఓవరాల్‌గా ప్రజలు కరోనాను లైట్ తీసుకోవడమే కేసుల పెరుగుదలకు కారణంగా వైద్య నిపుణులు భావిస్తున్నారు. ఇక నుంచేైనా ప్రజలు జాగ్రత్త వహించ కుంటే పెను ప్రమాదం తప్పదని హెచ్చరిస్తున్నారు.

Web TitleIs Lockdown Necessary in India?
Next Story