IRCTC New Booking Rule: నేటి నుంచే కొత్త రూల్.. ఆధార్ ఉంటేనే ఆ రోజూ ట్రైన్ టికెట్ బుకింగ్! పూర్తి వివరాలివే..

IRCTC New Booking Rule: నేటి నుంచే కొత్త రూల్.. ఆధార్ ఉంటేనే ఆ రోజూ ట్రైన్ టికెట్ బుకింగ్! పూర్తి వివరాలివే..
x
Highlights

ఐఆర్‌సీటీసీ టికెట్ బుకింగ్ నిబంధనల్లో మార్పు చేసింది. జనవరి 12 నుంచి ఆధార్ అథెంటికేషన్ ఉన్న యూజర్లకు మాత్రమే తొలిరోజు రాత్రి 12 గంటల వరకు టికెట్ బుకింగ్ చేసుకునే వీలుంటుంది.

మీరు తరచుగా రైలు ప్రయాణాలు చేస్తున్నారా? అయితే ఐఆర్‌సీటీసీ (IRCTC) టికెట్ బుకింగ్‌లో చేసిన కీలక మార్పును తప్పనిసరిగా తెలుసుకోవాలి. టికెట్ల బ్లాక్ మార్కెటింగ్, అక్రమాలకు చెక్ పెట్టేందుకు రైల్వే శాఖ 'ఆధార్ ఆథెంటికేషన్' (Aadhar Authentication) నిబంధనను మరింత కఠినతరం చేసింది.

నేటి (జనవరి 12) నుంచి మారిన సమయం

అడ్వాన్స్ రిజర్వేషన్ పీరియడ్‌లో టికెట్ బుకింగ్ ఓపెన్ అయిన మొదటి రోజున (Day 1), ఇకపై ఆధార్ వెరిఫికేషన్ పూర్తయిన యూజర్లకు మాత్రమే అవకాశం ఉంటుంది. దీనికి సంబంధించి సమయాన్ని ఐఆర్‌సీటీసీ మరింత పొడిగించింది:

కొత్త సమయం: బుకింగ్ ఓపెన్ అయిన తొలి రోజు ఉదయం 8 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు కేవలం ఆధార్ లింక్ అయిన అకౌంట్ల ద్వారానే టికెట్లు బుక్ చేసుకోవచ్చు.

ఇతరులకు ఎప్పుడు: ఆధార్ అథెంటికేషన్ లేని వారు మరుసటి రోజు (రెండో రోజు) నుంచి మాత్రమే టికెట్లు బుక్ చేసుకునే వీలుంటుంది.

ఎందుకు ఈ నిర్ణయం?

సాధారణంగా పండుగలు, సెలవుల సమయంలో టికెట్ బుకింగ్ ఓపెన్ అవ్వగానే కొందరు ఏజెంట్లు, దళారులు అక్రమ పద్ధతుల్లో టికెట్లను దక్కించుకుని, ప్రయాణికులకు అధిక ధరలకు అమ్ముతున్నారు. దీనిని అరికట్టేందుకు, అసలైన ప్రయాణికులకు టికెట్లు దొరికేలా చూసేందుకు ఐఆర్‌సీటీసీ ఈ 'ఆధార్ వెరిఫైడ్' నిబంధనను తీసుకొచ్చింది.

వరుసగా మారుతున్న నిబంధనలు:

తత్కాల్ టికెట్లు: 2025, జూలై 1 నుంచే తత్కాల్ బుకింగ్‌కు ఆధార్ అథెంటికేషన్ తప్పనిసరి చేశారు.

జనరల్ టికెట్లు: 2025, అక్టోబర్ 1 నుంచి జనరల్ టికెట్ రిజర్వేషన్‌కు కూడా ఈ రూల్ అమలు చేస్తున్నారు.

OTP వెరిఫికేషన్: కౌంటర్లు లేదా ఏజెంట్ల వద్ద తత్కాల్ టికెట్లు తీసుకున్నా.. మీ మొబైల్‌కు వచ్చే ఓటీపీ వెరిఫికేషన్ తప్పనిసరి.

ఆధార్‌ను ఐఆర్‌సీటీసీతో లింక్ చేయడం ఎలా?

  1. IRCTC వెబ్‌సైట్ లేదా యాప్‌లో లాగిన్ అవ్వండి.
  2. 'My Account' సెక్షన్‌కు వెళ్లి 'Link Your Aadhaar' ఆప్షన్ ఎంచుకోండి.
  3. మీ ఆధార్ నంబర్ ఎంటర్ చేసి, రిజిస్టర్డ్ మొబైల్‌కు వచ్చే ఓటీపీని ఎంటర్ చేయండి.
  4. వెరిఫికేషన్ పూర్తయ్యాక, మీరు ఆధార్ వెరిఫైడ్ యూజర్‌గా మారిపోతారు. దీనివల్ల నెలకు ఎక్కువ టికెట్లు (24 వరకు) బుక్ చేసుకునే అవకాశం కూడా లభిస్తుంది.
Show Full Article
Print Article
Next Story
More Stories