జూలైలో అంతర్జాతీయ విమాన సేవలు పునఃప్రారంభం

జూలైలో అంతర్జాతీయ విమాన సేవలు పునఃప్రారంభం
x
Highlights

కరోనా కట్టడికి దేశవ్యాప్తంగా విధించిన సుదీర్ఘ లాక్‌డౌన్‌ అనంతరం కేంద్ర ప్రభుత్వం ఇటీవలే దేశీయ విమాన సేవలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే....

కరోనా కట్టడికి దేశవ్యాప్తంగా విధించిన సుదీర్ఘ లాక్‌డౌన్‌ అనంతరం కేంద్ర ప్రభుత్వం ఇటీవలే దేశీయ విమాన సేవలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఇదే నేపథ్యంలో జూలై మాసంలో అంతర్జాతీయ విమాన సర్వీసులు కూడా పు:ణ తిరిగి ప్రారంభం కాబోతున్నాయి. ఇప్పటికే దీనికోసం ప్రణాళికలను కూడా సిద్దం చేసుకుంటుంది. జులై నుంచి విదేశాలకు విమాన రాకపోకలు పునరుద్ధరించే అవకాశం ఉందని విమానయాన మంత్రిత్వ శాఖ వర్గాలు వెల్లడి. కేంద్ర ప్రభుత్వం ప్రకటించే ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా అంతర్జాతీయ విమాన సర్వీసులను పునరుద్ధరించనున్నామని తెలిపారు.

ఇక ఇప్పటికే లాక్ డౌన్ కారణంగా విదేశాలల్లో చిక్కుకుపోయిన భారతీయులను కేంద్రం వెనక్కి తసుకురావాలనే ఉద్దేశంతో వందే భారత్ మిషన్ ను అమలు చేసారు. ఇందులో భాగంగా ప్రత్యేక విమానాల ద్వారా భారతీయులను వెనక్కి తీసుకువచ్చారు. ఇందుకు ఎయిర్ ఇండియా, ఆ తర్వాత ప్రైవేటు విమానయాన సంస్థలకు అనుమతులు ఇచ్చింది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories