మహాత్మా గాంధీ గురించి ఆసక్తికరమైన విషయాలు..

మహాత్మా గాంధీ గురించి ఆసక్తికరమైన విషయాలు..
x
Highlights

మహాత్మా గాంధీ అలియాస్ మోహన్ దాస్ కరంచంద్ గాంధీ ... భారతీయులందరిచే ఆదరింపబడే ఒక గొప్ప స్వాతంత్ర్య సమరయోధుడు. ప్రజలు ఆయనను జాతిపితగా గౌరవిస్తారు....

మహాత్మా గాంధీ అలియాస్ మోహన్ దాస్ కరంచంద్ గాంధీ ... భారతీయులందరిచే ఆదరింపబడే ఒక గొప్ప స్వాతంత్ర్య సమరయోధుడు. ప్రజలు ఆయనను జాతిపితగా గౌరవిస్తారు. సత్యము, అహింసలు గాంధీ నమ్మే సిద్ధాంత మూలాలు. సహాయ నిరాకరణ, సత్యాగ్రహము ఆయన ఆయుధాలు. కేవలం వీటితోనే రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించాడు. ఆంగ్లేయుల పాలన నుండి భారతదేశానికి స్వాతంత్ర్యము సాధించిన నాయకులలో ముఖ్యుడు.. అలాంటి మహాత్ముడు గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలుసుకుందాం..

1. మహాత్మా గాంధీ మాతృభాష గుజరాతీ.

2. రాజ్కోట్ లోని ఆల్ఫ్రెడ్ హై స్కూల్ లో తన పాఠశాల విద్యను పూర్తి చేశాడు.

3. గాంధీ పుట్టినరోజు అయిన (అక్టోబర్ 2)ను ప్రపంచ వ్యాప్తంగా అంతర్జాతీయ అహింసా దినోత్సవంగా పిలుస్తారు.

4. గాంధీ తన తల్లితండ్రులకు చివరి సంతానం.. ఆయనకి ఇద్దరు సోదరులు మరియు ఒక సోదరి ఉన్నారు.

5. గాంధీ శుక్రవారం రోజు జన్మించారు, శుక్రవారం భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది. మరియు శుక్రవారం గాంధీ హత్యకు గురయ్యారు.

6.మాజీ బిర్లా హౌస్ తోటలో మోహన్‌దాస్ కరంచంద్ గాంధీని హత్య చేశారు.

7. మహాదేవ్ దేశాయ్ గాంధీ ఆయనకి పర్సనల్ సేకరెట్రిగా పనిచేసారు.

8.గాంధీ కేవలం స్వాతంత్ర్యం కోసం పోరాడడమే కాకుండా, అంటరానివారికి, అట్టడుగు వర్గాలకు న్యాయమైన చికిత్స చేయాలని డిమాండ్ చేశాడు మరియు వారికి మద్దతుగా అనేక ఉపవాసాలు కూడా చేశాడు. అంటరానివారిని "దేవుని పిల్లలు" అని అర్ధం హరిజన్లు అని కూడా పిలిచాడు.

9. 1982 లో గాంధీ మోహన్‌దాస్ కరంచంద్ గాంధీ ఆధారంగా నిర్మించిన ఒక పురాణ చారిత్రక నాటక చిత్రం ఉత్తమ చలన చిత్రంగా అకాడెమిక్ అవార్డును గెలుచుకుంది.

10. శాంతి నోబెల్ బహుమతికి 5 సార్లు మహాత్మా గాంధీ నామినేట్ అయ్యారు. కానీ ఆయనకు నోబెల్ దక్కలేదు. దీంతో గాంధీ శాంతి బహుమతి పేరిట అవార్డులు ఇవ్వడాన్ని భారత్ ప్రారంభించింది.

11.భారత స్వాతంత్ర్యం కోసం మహాత్మా గాంధీ పోరాడిన దేశం అయిన గ్రేట్ బ్రిటన్, ఆయన మరణించిన 21 సంవత్సరాల తరువాత, ఆయనను గౌరవించే స్టాంప్‌ను విడుదల చేసింది.

12. నోబెల్ బహుమతి గ్రహీత బెంగాలీ కవి రవీంద్రనాథ్ ఠాగూర్ గాంధీకి మహాత్మా అని బిరుదుని ఇచ్చారు.

13. మహాత్మా గాంధీ అంత్యక్రియల ఊరేగింపు 8 కిలోమీటర్ల పొడవుగా సాగింది.

14. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 1996 లో మహాత్మా గాంధీ బొమ్మను నోట్లపై జారీ చేసింది. ముందుగా 10 మరియు 500 రూపాయల నోట్లని కలిగి ఉంది.

15. 1959 లో గాంధీ మెమోరియల్ మ్యూజియం స్థాపించబడింది. ఇది భారతదేశంలోని తమిళనాడులోని మదురై నగరంలో ఉంది. దీనిని గాంధీ మ్యూజియం అని కూడా అంటారు. ఇందులో నాథురామ్ గాడ్సే హత్య చేసినప్పుడు మహాత్మా గాంధీ ధరించిన రక్తపు మరక ఉంది.

16. గాంధీ భార్య కస్తూర్బా.. ఆమె మరణించిన ఫిబ్రవరి 22న మన దేశంలో మదర్స్ డే‌గా జరుపుకొంటారు. ఆమె చనిపోయిన సమయంలో గాంధీ కూడా జైళ్లో ఉన్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories