Delhi - Latest News: ఢిల్లీకి ఉగ్రదాడుల హెచ్చరికలు

*అప్రమత్తంగా ఉండాలన్న సీపీ రాకేశ్ ఆస్తానా *నగరంలో నిఘా పెంచాలని ఆదేశం

Shilpa
Published on: 10 Oct 2021 12:27 PM IST
Intelligence Sources says that the National Capital Delhi is Under Threat
X

ఢిల్లీకి ఉగ్రదాడుల హెచ్చరికలు(ఫైల్ ఫోటో)

Delhi - Latest News: దేశరాజధాని ఢిల్లీకి ఉగ్రముప్పు పొంచి ఉన్నట్లు ఇంటెలిజెన్స్‌ వర్గాలు తెలిపాయి. దీంతో నగర పోలీసులు అప్రమత్తమయ్యారు. పండగ నేపథ్యంలో ఉగ్రవాదులు దాడులకు ప్రయత్నిస్తున్నారని హెచ్చరికలు రావడంతో దిల్లీ పోలీస్ కమిషనర్ రాకేశ్‌ ఆస్తానా అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. పోలీసులంతా అలర్ట్‌గా ఉండాలని సూచించారు.

నగరమంతా పెట్రోలింగ్‌‌ను ముమ్మరం చేయాలన్నారు. సైబర్ కేఫ్‌లు, కెమికల్ షాపులు, పార్కింగ్ స్థలాలతో పాటు కార్ డీలర్స్‌ను నిశితంగా పరిశీలించాలన్నారు. ఇక హెచ్చరికల నేపథ్యంలో ఢిల్లీ పోలీసులు నగరాన్ని జల్లెడ పట్టేందుకు నిర్ణయం తీసుకున్నారు. పనుల నిమిత్తం వచ్చిన వారితో పాటు అద్దె ఇళ్లలో ఉన్నవారి వివరాలు ఆరా తీయనున్నారు.

Shilpa

Shilpa

Next Story