మహారాష్ట్ర మంత్రి చంద్రకాంత్ పాటిల్‌ ముఖంపై సిరా

* దుండగుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు

R Tripura Malini
Published on: 12 Dec 2022 7:02 AM IST
Ink On Face Of Maharashtra Minister Chandrakant Patil
X

మహారాష్ట్ర మంత్రి చంద్రకాంత్ పాటిల్‌ ముఖంపై సిరా

Maharashtra: మహారాష్ట్రలో మంత్రి చంద్రకాంత్ పాటిల్‌ ముఖంపై నల్ల ఇంకునే చల్లి నిరసన తెలిపారు. పింప్రి చించువాడ్‌లో జరిగే కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన సందర్భంగా హఠాత్పరిణామం చోటుచేసుకుంది. ఇటీవల ఔరంగాబాద్‌లో అంబేద్కర్ , జ్యోతిరావుఫూలేలపై చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ ఇంకుచల్లినట్లు ఆందోళనకారులు తెలిపారు. ఇంకుచల్లిన వెంటనే అక్కడే ఉన్న సెక్యూరిటీ సిబ్బంది నిందితులను అరెస్టుచేసి పోలీస్ స్టేషన్‌‌కు తరలించారు. శివసేన, నేషనల్ కాంగ్రెస్ కార్యకర్తల చిల్లర రాజకీయాలపై బీజేపీ కార్యకర్తలు స్పందించవద్దని మంత్రి చంద్రకాంత్ పాటిల్ విజ్ఞప్తి చేశారు. ఇంకు కంటిలో పడటంతో ఐ డ్రాప్స్‌ వేసుకుని ఉపశమనం పొందానని మంత్రి తెలిపారు. ఈఘటనపై బీజేపీ కార్యకర్తలు ఎక్కడా నిరసన కార్యక్రమాలకు దిగవద్దని విన్నవించారు.

R Tripura Malini

R Tripura Malini

Next Story