Farmer Leader: రాకేష్‌ టికాయత్‌పై ఇంకు దాడి..

Rakesh Tikait: భారతీయ కిసాన్‌ యూనియన్‌ నాయకుడు రాకేష్‌ టికాయత్‌కు బెంగళూరులో చేదు అనుభవం ఎదురయ్యింది.

Arun Chilukuri
Published on: 30 May 2022 2:25 PM IST
Ink Attack On Farmer Leader Rakesh Tikait In Bengaluru
X

Farmer Leader: రాకేష్‌ టికాయత్‌పై ఇంకు దాడి

Rakesh Tikait: భారతీయ కిసాన్‌ యూనియన్‌ నాయకుడు రాకేష్‌ టికాయత్‌కు బెంగళూరులో చేదు అనుభవం ఎదురయ్యింది. భారతీయ కిసాన్‌ యూనియన్‌ కర్ణాటక నాయకుడు కోడిహళ్లి చంద్రశేఖర్‌ ఇటీవల ఓ టీవీ చానల్‌ నిర్వహించిన స్టింగ్‌ ఆపరేషన్‌లో లంచం అడుగుతూ పట్టుబడ్డాడు. అయితే ఈ విషయంలో తమ ప్రమేయం లేదని స్పష్టత ఇచ్చేందుకు టికాయత్‌, యుధ్వీర్‌ సింగ్‌ బెంగళూరుకు వచ్చారు. గాంధీ భవన్‌లో విలేకరులతో సమావేశంలో మాట్లాడుతుండగా కొందరు టికాయత్‌పై నల్ల సిరాను విసిరారు.

దీంతో అక్కడ గందరగోళం నెలకొన్నది. వెంటనే తేరుకున్న భారతీయ కిసాన్‌ యూనియన్‌ నాయకులు అక్కడికి వచ్చిన దుండగులపై దాడికి దిగారు. ఇదంతా టికాయత్‌ చూస్తుండగానే జరిగింది. అయితే టికాయత్‌పై బీజేపీ నాయకులే దాడి చేయించారని భారతీయ కిసాన్‌ యూనియన్‌ నాయకులు ఆరోపించారు. ఈ ఆరోపణలు బీజేపీ నాయకులు ఖండించారు. చంద్రశేఖర్‌ అనుచరులే దాడికి దిగినట్టు తెలిపారు. గత ఏడాదిన్నర కాలంగా టికాయత్‌ బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story