కరోనా కట్టడికి ఇండస్ఇండ్ బ్యాంకు రూ.30 కోట్ల విరాళం

కరోనా కట్టడికి ఇండస్ఇండ్ బ్యాంకు రూ.30 కోట్ల విరాళం
x
Highlights

కరోనావైరస్(COVID -19) మహమ్మారికి వ్యతిరేకంగా పోరాడటానికి ఇండస్ఇండ్ బ్యాంక్ కూడా ముందుకు వచ్చింది. ప్రధాన మంత్రి సహాయనిధికి భారీ విరాళం ప్రకటించింది.

కరోనావైరస్(COVID -19) మహమ్మారికి వ్యతిరేకంగా పోరాడటానికి ఇండస్ఇండ్ బ్యాంక్ కూడా ముందుకు వచ్చింది. ప్రధాన మంత్రి సహాయనిధికి భారీ విరాళం ప్రకటించింది.ఇండస్ఇండ్ బ్యాంక్ రూ. 30 కోట్ల రూపాయల విరాళాన్ని ప్రకటించింది. కరోనా వైరస్ మహమ్మారిని ఎదుర్కోవటానికి ఈ బ్యాంక్ ఇప్పటికే ఫేస్ మాస్క్‌లు, హ్యాండ్ శానిటైజర్లు మరియు చేతి తొడుగులు వంటి సహాయక సామగ్రిని బాధిత ప్రాంతాలకు సరఫరా చేసింది. విధి నిర్వహణలో ఉన్న వైద్య అధికారులకు పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్‌మెంట్ (పిపిఇ) ను సులభతరం చేయడానికి కూడా బ్యాంక్ కృషి చేస్తోంది.

ఇదిలావుంటే అంతర్జాతీయ రేటింగ్ ఏజెన్సీ గోల్డ్‌మెన్‌ శాక్స్‌ సింగపూర్‌ అనుబంధ సంస్థ పీటీఈ-ఒడిఐ (ఆఫ్‌షోర్‌ డెరివేటివ్‌ ఇన్‌స్ట్రుమెంట్స్‌) ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌లో 0.65 శాతం వాటా కొనుగోలు చేసింది. ఇందులో ఓపెన్‌ మార్కెట్‌ లావాదేవీ ద్వారా ఒక్కో షేరు ను రూ.430 చొప్పున మొత్తం 41 లక్షల షేర్లను కొనుగోలు చేసింది. ఈ లావాదేవీ మొత్తం విలువ 176 కోట్ల రూపాయలుగా ఉంది.


Show Full Article
Print Article
Next Story
More Stories