త్రిపుర గవర్నర్‌గా నల్లు ఇంద్రసేనారెడ్డి

Indrasena Reddy Appointed as Tripura Governor
x

త్రిపుర గవర్నర్‌గా నల్లు ఇంద్రసేనారెడ్డి

Highlights

Indrasena Reddy: నల్లు ఇంద్రసేనారెడ్డిని నియమిస్తూ రాష్ట్రపతి ఉత్తర్వులు

Indrasena Reddy: త్రిపుర, ఒడిశా రాష్ట్రాలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కొత్త గవర్నర్లను నియమించారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి భవన్‌ ఓ ప్రకటన విడుదల చేసింది. త్రిపుర నూతన గవర్నర్‌గా తెలంగాణకు చెందిన బీజేపీ సీనియర్‌ నేత నల్లు ఇంద్రసేనారెడ్డిని నియమిస్తూ రాష్ట్రపత్తి ఉత్తర్వులు జారీ చేశారు. అలాగే.. ఒడిశా గవర్నర్‌గా ఝార్ఖండ్‌ మాజీ సీఎం రఘుబర్‌ దాస్‌లను నియమించారు. తెలంగాణలోని సూర్యాపేట జిల్లాకు చెందిన నల్లు ఇంద్రసేనా రెడ్డి.. గతంలో మలక్‌పేట నుంచి మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేశారు. 2022లో తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ చేరికలు, సమన్వయ కమిటీ ఛైర్మన్‌గా నియమితులయ్యారు. ఒడిశా గవర్నర్‌గా నియమితులైన రఘుబర్‌దాస్‌ ప్రస్తుతం బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడిగా ఉన్నారు. 2014 నుంచి 2019 వరకు ఆయన జార్ఖండ్‌ సీఎంగా పనిచేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories