సముద్రంలో కూలిన ఇండోనేషియాలో గల్లంతైన విమానం

representational image
* పదివేల అడుగుల ఎత్తు నుంచి కుప్పకూలిన విమానం * జావా సముద్రంలో శిథిలాలు గుర్తించిన అధికారులు * మధ్యాహ్నం 2.40 గం.లకు రాడార్ నుంచి మాయమైన విమానం
ఇండోనేషియాలో ప్రయాణికుల విమానం గల్లంతు కావడం తీవ్ర కలకలం రేపుతోంది. జకార్తా నుంచి పోంటియానక్‌కు 62 మందితో బయల్దేరిన ఎయిర్ బోయింగ్ 737-500 శ్రీ విజయ విమానం ఆచూకీ గల్లంతైనట్టు అక్కడి అధికారులు వెల్లడించారు. జకార్తా విమానాశ్రయంలో టేకాఫ్ అయిన నాలుగు నిమిషాల్లోనే ఏటీసీతో సంబంధాలు తెగిపోయిన ప్రాంతంలో గాలింపు చర్యలు చేపట్టారు. జావా సముద్రంలో సంబంధాలు తెగిపోయినట్టు అధికారులు గుర్తించారు. దాంతో అక్కడే ఇండోనేషియాలో గల్లంతైన విమానం సముద్రంలో కుప్పకూలింది. విమానం సిగ్నల్స్ నుంచి సంబంధాలు తెగిపోయిన ప్రాంతంలో గాలింపు చర్యలు చేపట్టారు. జావా సముద్రంలో బోయింగ్ విమానం జాడ కోసం ముమ్మర ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. రాడార్ సమాచారాన్ని విశ్లేషిస్తున్నారు.
ఇండోనేషియా రాజధాని జకర్తా నుంచి మధ్యాహ్నం 2 గంటల 30 నిమిషాల తర్వాత బయలుదేరిన విమానం.. టేకాఫ్ అయిన నాలుగు నిమిషాలకే రాడార్‌కు చిక్కకుండా అదృశ్యమైంది. చివరగా 2 గంటల 40 నిమిషాలకు విమానం నుంచి సిగ్నల్స్ అందినట్లు చెబుతున్నారు అధికారులు. ఆ సమయంలో జావా సముద్రం ప్రాంతంలో పదివేల అడుగుల ఎత్తులో విమానం ఉందని తెలిపారు. అయితే విమానం సముద్రంలో కుప్పకూలి పోయి ఉంటుందనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
మరోవైపు థౌజండ్ ద్వీపాల్లో విమాన శకలాలను స్థానిక జాలర్లు గుర్తించినట్టు తెలుస్తోంది. ఈ విమానం అదృశ్యంపై సంబంధిత విమానయాన సంస్థ కూడా స్పందిచింది. జకార్తా నుంచి పోంటియానక్ వెళ్లేందుకు 90నిమిషాల సమయం పడుతుందని పేర్కొంది. ఈ విమానంలో 56 మంది ప్రయాణికులు, ఆరుగురు సిబ్బందితో మొత్తం 62 మంది ఉన్నట్టు స్పష్టం చేసింది. అయితే ఇండోనేషియాలోని పశ్చిమ కలిమంటన్ ప్రావిన్స్‌లోని పోంటియానక్‌కు బయల్దేరిన ఈ బోయింగ్ 737-500 విమానం 27 ఏళ్ల నాటిదిగా గుర్తించారు.
ఇండోనేసియాతో తరుచూ ఇలాంటి ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. 2018 అక్టోబరులో ఇండోనేసియాకు చెందిన లయన్ ఎయిర్ సంస్థ విమానం సముద్రంలో కుప్పకూలింది. ఆ ప్రమాదంలో 189 మంది మరణించారు. లయన్ ఎయిర్‌కు చెందిన బోయింగ్ 737 మ్యాక్స్ విమానం జకార్తాలో టేకాఫ్ అయిన 12 నిమిషాల్లోనే కుప్పకూలింది. ఇండోనేషియాలో రవాణా సదుపాయాలు అంతంతమాత్రంగానే ఉండటంతో అక్కడ ప్రమాదాలు సర్వసాధారణంగా జరుగుతుంటాయని విశ్లేషకులు అంటున్నారు. ఎక్కువ రద్దీకి తోడు మౌలిక వసతులు సరిగా లేకపోవడం, భద్రతా ప్రమాణాలు కూడా పాటించకపోవడంతో ఇలాంటి ఘటనలు జరుగుతుంటాయని చెబుతున్నారు.
ఇండోనేషియాలో రవాణా సదుపాయాలు అంతంతమాత్రంగానే ఉండటంతో అక్కడ ప్రమాదాలు సర్వసాధారణంగా జరుగుతుంటాయని విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఎక్కువ రద్దీకి తోడు మౌలిక వసతులు సరిగా లేకపోవడం, భద్రతా ప్రమాణాలు కూడా పాటించకపోవడంతో ఇలాంటి ఘటనలు జరుగుతుంటాయని చెబుతున్నారు.
ఇండోనేషియాలో శ్రీవిజయ సంస్థకు చెందిన ప్యాసింజర్ ఫ్లైట్ అదృశ్యం ఉత్కంఠ రేపుతున్నది. రాజధాని జకర్తా నుంచి బయలుదేరిన నాలుగు నిమిషాలకే SJ182 నంబర్‌గల బోయింగ్-737-500 విమానానికి రాడార్‌తో సంబంధాలు తెగిపోయాయి. దాంతో అధికారులు విమానం జాడ కోసం ముమ్మరంగా ప్రయత్నిస్తున్నారు. రాడార్ సమాచారాన్ని విశ్లేషిస్తున్నారు. అదృశ్యమైన విమానంలో ఐదుగురు చిన్నారులు సహా 56 మంది ప్రయాణికులు, ఆరుగురు సిబ్బంది కలిపి మొత్తం 62 మంది ఉన్నారని శ్రీవిజయ సంస్థ తెలిపింది.
విమానం జకర్తా నుంచి బోర్నియో ఐలాండ్‌లోని పోంటియానక్‌కు వెళ్తూ అదృశ్యమైందని ఇండోనేషియా ట్రాన్స్‌పోర్టు మినిస్ట్రీ వెల్లడించింది. స్థానిక కాలమానం ప్రకారం మధ్యాహ్నం 2.40 గంటలకు విమానంతో రాడార్‌కు సంబంధాలు తెగిపోయాయని తెలిపింది. అదృశ్యమైన సమయంలో విమానం 10 వేల అడుగుల ఎత్తులో ఉందని వెల్లడించింది. కాగా, ఇండోనేషియాలో ఎక్కువ రద్దీకి తోడు భద్రతా ప్రమాణాలు సరిగా పాటించకపోవడంతో తరచూ ప్రమాదాలు జరుగుతుంటాయని విశ్లేషకులు చెబుతున్నారు.
మోడీకి కేసీఆర్ వెల్కమ్ చెప్పకపోవడానికి రీజన్!
25 May 2022 12:30 PM GMTతెలంగాణలో బీజేపీ కార్యక్రమాల్లో ప్రధాని ఎందుకు పాల్గొనడం లేదు?
25 May 2022 12:03 PM GMTక్రికెటర్ దిగ్గజం సచిన్ కొడుకు అర్జున్‌కు మళ్లీ నిరాశే.. దక్కని ఛాన్స్...
25 May 2022 4:45 AM GMTఐపీఎల్ సీజన్ 15 లో ఫైనల్ కు గుజరాత్ జట్టు.. సిక్స్ లతో చెలరేగిన డేవిడ్ మిల్లర్...
25 May 2022 4:04 AM GMTదావోస్‌లో కలుసుకున్న ఏపీ సీఎం జగన్, మంత్రి కేటీఆర్...
24 May 2022 4:30 AM GMTపొగలు కక్కుతూ సెగలు రేపుతున్న స్మోక్ బిస్కెట్స్.. న్యూ ఫీలింగ్.. నో సైడ్ ఎఫెక్ట్స్...
24 May 2022 4:11 AM GMTసడన్‌గా హైదరాబాద్‌కు తిరిగి వచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్.. ఏం జరిగింది..?
24 May 2022 3:33 AM GMT
మహేష్ బాబు కోసం స్టార్ హీరో ని విలన్ గా మార్చనున్న రాజమౌళి
25 May 2022 4:00 PM GMTకరీంనగర్ లో ఒవైసీకి బండి సవాల్
25 May 2022 3:45 PM GMTప్రగతి భవన్లో సీఎం కేసీఆర్‌ను కలిసి కృతజ్ఞతలు తెలిపిన రాజ్యసభ...
25 May 2022 3:30 PM GMTఅనిల్ రావిపూడి బాలక్రిష్ణ సినిమాలో హీరోయిన్ ఎవరో తెలుసా!
25 May 2022 3:15 PM GMTఆత్మకూరు ఉపఎన్నిక షెడ్యూల్ విడుదల..
25 May 2022 2:56 PM GMT