Indigo Crisis Continues: ఇండిగోలో కొనసాగుతున్న సంక్షోభం.. వరుసగా ఏడోరోజు రద్దైన విమానాలు

Indigo Crisis Continues: దేశీయ విమానయాన సంస్థ ఇండిగోలో సంక్షోభం కొనసాగుతోంది. వరుసగా ఏడోరోజు విమానాలు రద్దయ్యాయి.

Arun Chilukuri
Published on: 8 Dec 2025 11:39 AM IST
Indigo Crisis Continues: ఇండిగోలో కొనసాగుతున్న సంక్షోభం.. వరుసగా ఏడోరోజు రద్దైన విమానాలు
X

Indigo Crisis Continues: ఇండిగోలో కొనసాగుతున్న సంక్షోభం.. వరుసగా ఏడోరోజు రద్దైన విమానాలు

Indigo Crisis Continues: దేశీయ విమానయాన సంస్థ ఇండిగోలో సంక్షోభం కొనసాగుతోంది. వరుసగా ఏడోరోజు విమానాలు రద్దయ్యాయి. ఇవాళ శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో 112 సర్వీసులను ఇండిగో రద్దు చేసింది. ఇందులో హైదరాబాద్‌కు రావాల్సిన 58 సర్వీసులు ఉండగా.. ఇక్కడి నుంచి వెళ్లాల్సిన 54 విమానాలు ఉన్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. విమానాల రద్దుతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

మరోవైపు విశాఖ నుంచి 7 ఫ్లైట్లను ఇండిగో క్యాన్సిల్ చేసింది. వీటిలో హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, ఢిల్లీకి వెళ్లాల్సిన విమానాలు ఉన్నాయి. అదేవిధంగా అహ్మదాబాద్ నుంచి రాకపోకలు సాగించే 18 విమానాలు క్యాన్సిల్ అయ్యాయి. ఇవాళ కూడా ఇండిగో విమానాలు లేటుగా నడిచే అవకాశం ఉందని తెలిపింది. ఎయిర్‌పోర్ట్‌కు వచ్చే ముందు స్టేటస్ చెక్ చేసుకోవాలని సూచించింది. అయితే ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో ఇప్పటివరకు మొత్తం 134 ఫ్లైట్లను ఇండిగో క్యాన్సిల్ చేసింది.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story