Tatkal Ticket: తత్కాల్ టికెట్ల బుకింగ్‌కు ఇకపై ఈ-ఆధార్‌తో ధృవీకరణ తప్పనిసరి!

Tatkal Ticket
x

Tatkal Ticket: తత్కాల్ టికెట్ల బుకింగ్‌కు ఇకపై ఈ-ఆధార్‌తో ధృవీకరణ తప్పనిసరి!

Highlights

Tatkal Ticket: ఇకపై తత్కాల్ టికెట్ బుక్ చేసుకోవాలంటే మీ ఆధార్ కార్డుతో లింక్ అయి ఉండాల్సిందే! రైల్వే శాఖ ప్రయాణికుల గుర్తింపును మరింత కచ్చితంగా నిర్ధారించడానికి ఈ కొత్త విధానాన్ని తీసుకువస్తోంది.

Tatkal Ticket: ఇకపై తత్కాల్ టికెట్ బుక్ చేసుకోవాలంటే మీ ఆధార్ కార్డుతో లింక్ అయి ఉండాల్సిందే! రైల్వే శాఖ ప్రయాణికుల గుర్తింపును మరింత కచ్చితంగా నిర్ధారించడానికి ఈ కొత్త విధానాన్ని తీసుకువస్తోంది. దీని ప్రకారం, రైల్వే మంత్రిత్వ శాఖ సెంటర్ ఫర్ రైల్వే ఇన్ఫర్మేషన్ సిస్టమ్ (CRIS)కు ఆధార్‌ను ఉపయోగించి ప్రయాణికుల వివరాలు సరిచూసుకోవడానికి అనుమతి ఇచ్చింది.

ఎప్పటి నుంచి అమల్లోకి వస్తుంది?

ఈ విషయం గురించి మే 27, 2025న ఒక అధికారిక ప్రకటన కూడా వెలువడింది. దీని ప్రకారం టికెట్ చెకింగ్ సిబ్బంది, ఇతర రైల్వే సిబ్బంది ప్రయాణికుల గుర్తింపును ఆధార్ ద్వారా ధృవీకరించుకోవచ్చు.

మంత్రి ఏమన్నారంటే..

రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ జూన్ 4, 2025న స్వయంగా ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా తెలియజేశారు. త్వరలోనే తత్కాల్ టికెట్ల బుకింగ్‌కు ఈ-ఆధార్‌ను తప్పనిసరి చేస్తామని ఆయన పేర్కొన్నారు. దీనివల్ల టికెట్ బుకింగ్ ప్రక్రియ మరింత సులభతరం అవుతుందని రైల్వే అధికారులు చెబుతున్నారు.



ఎందుకీ మార్పు?

ప్రస్తుతం ఐఆర్‌సీటీసీ థర్డ్ పార్టీ ద్వారా ఆధార్ ధృవీకరణ చేస్తోంది. దీనివల్ల చాలా సమయం పడుతోంది. అందుకే రైల్వే శాఖ ఈ ప్రక్రియను మరింత వేగవంతం చేయడానికి ఈ నిర్ణయం తీసుకుంది. అంతేకాకుండా, ఐఆర్‌సీటీసీలో 130 మిలియన్ల మంది యూజర్లు ఉండగా, కేవలం 12 మిలియన్ల మంది మాత్రమే ఆధార్‌తో తమ ఖాతాలను ధృవీకరించుకున్నారు. మిగిలిన ఖాతాలను కూడా ధృవీకరించాలని రైల్వే శాఖ నిర్ణయించింది. అనుమానాస్పదంగా ఉన్న ఖాతాలను మూసివేయనున్నారు.

దీని వల్ల ఉపయోగాలు ఏమిటి?

ఆధార్‌తో లింక్ చేసిన ఖాతాదారులకు తత్కాల్ టికెట్ల అమ్మకాలు మొదలైన మొదటి 10 నిమిషాల్లో టికెట్లు బుక్ చేసుకునే అవకాశం ఉంటుంది.

♦ అనధికారికంగా టికెట్లు బుక్ చేసే ఏజెంట్ల బెడద తప్పుతుంది.

♦ నిజమైన ప్రయాణికులకు టికెట్లు సులభంగా అందుబాటులో ఉంటాయి.

కాబట్టి, మీ ఐఆర్‌సీటీసీ ఖాతాను వెంటనే ఆధార్‌తో లింక్ చేసుకోండి. తత్కాల్ టికెట్ బుకింగ్‌లో ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రయాణం చేయండి.

Show Full Article
Print Article
Next Story
More Stories