Narendra Modi: బ్రిటన్ ప్రధాని స్టార్మర్‌కి భారత్ ప్రధాని మోడీ ఫోన్

Narendra Modi: స్టార్మర్‌కి శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని నరేంద్ర మోడీ

హెచ్ఎంటీవీ డెస్క్
Updated on: 6 July 2024 9:46 PM IST
Indian Prime Minister Modi Called To British Prime Minister Starmer
X

Narendra Modi: బ్రిటన్ ప్రధాని స్టార్మర్‌కి భారత్ ప్రధాని మోడీ ఫోన్

Narendra Modi: బ్రిటన్‌ నూతన ప్రధాని స్టార్మర్‌కు ప్రధాని నరేంద్ర మోడీ ఫోన్‌ చేసి శుభాకాంక్షలు తెలిపారు. త్వరలో భారత్‌కి రావాలని ఈ సందర్భంగా ప్రధాని మోడీ.. స్టార్మర్‌ను ఆహ్వానించారు. ఈ విషయాన్ని ప్రధాని కార్యాలయం ఒక ప్రకటనలో వెల్లడించింది. ప్రజల పురోగతి, శ్రేయస్సు, వ్యూహత్మక భాగస్వామ్యానికి కట్టుబడి ఉన్నామని మోడీ ట్వీట్ చేశారు. ధృఢమైన ఆర్థిక సంబంధాలను కొనసాగిస్తూ కలిసికట్టుగా పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు ప్రధాని మోడీ. ఇక బ్రిటన్‌ పార్లమెంట్‌ ఎన్నికల్లో దాదాపు 14 ఏళ్ల విరామం తర్వాత లేబర్‌ పార్టీ విజయం సాధించింది. 650 స్థానాలున్న బ్రిటన్‌ పార్లమెంటులో 412 స్థానాలను లేబర్‌ పార్టీ గెలుచుకుంది. కన్జర్వేటివ్‌ పార్టీ కేవలం 121 స్థానాలకు పరిమితమైంది.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story