వావ్ గ్రేట్.. 60వేల తేనెటీగలు.. దాదాపు 4గంటలకు పైగా ఒంటిమీద..

వావ్ గ్రేట్.. 60వేల తేనెటీగలు.. దాదాపు 4గంటలకు పైగా ఒంటిమీద..
x
Highlights

సృష్టిలో మధురమైన పదార్ధాలలో తేనె కూడా ఒకటి.. తేనెటీగలు తయారు చేసే తేనెను ప్రాచీన కాలంనుండి ఆరగిస్తున్నారు. రుచికే కాదు ఆరోగ్యానికి తేనె ఎంతో మంచిది. అటువంటి తేనెపట్టు పట్టాలంటే సాహసమే చెయ్యాలి. తేనెటీగల దాడికి గురైతే అనారోగ్యానికి గురవుతారు.

సృష్టిలో మధురమైన పదార్ధాలలో తేనె కూడా ఒకటి.. తేనెటీగలు తయారు చేసే తేనెను ప్రాచీన కాలంనుండి ఆరగిస్తున్నారు. రుచికే కాదు ఆరోగ్యానికి తేనె ఎంతో మంచిది. అటువంటి తేనెపట్టు పట్టాలంటే సాహసమే చెయ్యాలి. తేనెటీగల దాడికి గురైతే అనారోగ్యానికి గురవుతారు. ఒక్కోసారి వీటి దాడి వలన ప్రాణాలు సైతం కోల్పోవచ్చు. తేనెపట్టును కదిలించేటప్పుడు అన్ని జాగ్రత్తలు తీసుకుంటారు. కొందరు సాహసవీరులు అయితే తేనెటీగలను ఒంటిమీదకు ఎక్కించుకుంటారు. అలా కేరళకు చెందిన ఓ వ్యక్తి కూడా చిన్నప్పటినుంచి ఈ సాహసం చేస్తున్నాడు. కేరళకు చెందిన సంజయ్‌కుమార్‌ ఒక తేనెటీగలను పెంచుతున్నారు. తేనెటీగల ద్వారా వచ్చిన తేనెను అమ్ముకొని జీవనం సాగిస్తున్నారు. అయితే అతని 24 ఏళ్ల ఆయన కుమారుడు తన చిన్ననాటి నుంచే తేనెటీగల పెంపకాన్ని చూస్తూ వాటితో స్నేహం చేస్తూ వస్తున్నాడు.

అవి కుట్టకుండా ఎలా మచ్చిక చేసుకోవాలో బాగా తెలుసుకున్నాడు. తన ఏడవ ఏటనుంచే వందలాది తేనెటీగలను తన ముఖం మీద, చేతులు, పొట్టమీద మీద ఉంచుకోవడం చేస్తున్నాడు. ఇది చూసిన అతని స్నేహితులు, బంధువులు ఆశ్చర్యానికి గురయ్యేవారు. అయితే ఎప్పటికైనా తేనెటీగలు ఎక్కువసేపు ఒంటిమీద ఉంచుకొని గిన్నిస్ బుక్ లో పేరు సంపాదించాలని అతని కోరిక. ఇందుకోసం దాదాపు 4 గంటల 10 నిమిషాల పాటు 60వేల తేనెటీగలను తన మొహంపై ఉంచుకొని గిన్నిస్‌ రికార్డును నెలకొల్పాడు. తేనెటీగలమీద మక్కువతోనే ఎపీకల్చర్‌లో బెంగళూర్‌లో మాస్టర్స్‌ డిగ్రీ చేశాడు. త్వరలోనే తేనెటీగల గురించి అధ్యయనం చేసి డాక్టరేట్‌ కూడా పొందాలని అనుకుంటున్నాడు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories