Indian Air Force Strength Increased: 22 అపాచీ , 15 చినూక్ హెలికాప్టర్లను భారత వైమానిక దళానికి చేర్చాం : బోయింగ్

Indian Air Force Strength Increased: 22 అపాచీ , 15 చినూక్ హెలికాప్టర్లను భారత వైమానిక దళానికి చేర్చాం : బోయింగ్
x
Indian Air Force Strength Increased
Highlights

Indian Air Force Strength Increased: అమెరికన్ ఏవియేషన్ కంపెనీ బోయింగ్ సంస్థ.. అపాచీ , చినూక్ మిలిటరీ హెలికాప్టర్లను భారత వైమానిక దళానికి అందించే ప్రక్రియను పూర్తి చేసింది.

Indian Air Force Strength Increased: అమెరికన్ ఏవియేషన్ కంపెనీ బోయింగ్ సంస్థ.. అపాచీ , చినూక్ మిలిటరీ హెలికాప్టర్లను భారత వైమానిక దళానికి అందించే ప్రక్రియను పూర్తి చేసింది. 22 అపాచీ హెలికాప్టర్లు, 15 చినూక్ హెలికాప్టర్లు కొనడానికి భారత్ బోయింగ్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. మార్చి ప్రారంభంలో 5 చినూక్ హెలికాప్టర్లను చివరి సరుకును హిండన్ వైమానిక దళం స్టేషన్‌కు చేర్చింది. అలాగే జూన్ చివరి వారంలో 5 అపాచీ హెలికాప్టర్లను రవాణా చేసినట్లు బోయింగ్ శుక్రవారం నివేదించింది.

దీనిపై బోయింగ్ డిఫెన్స్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ సురేంద్ర అహుజా మాట్లాడుతూ- ఈ సైనిక హెలికాప్టర్ల కొనుగోలు ప్రక్రియతో భారత్ తో బంధం మరింత బలపడిందని అన్నారు. భారత రక్షణ దళాల సామర్థ్యాలకు తగినవిధంగా బోయింగ్ సంస్థ పనిచేస్తుందని అన్నారు.

కాగా భారతదేశం.. అపాచీలో అత్యంత అధునాతన వేరియంట్ అయినా AH-64E ను కొనుగోలు చేసింది. ఇవి ఇప్పటికె 17 దేశాలలో ఉన్నాయి. H-64E అపాచీలో సరికొత్త కమ్యూనికేషన్ సిస్టమ్స్, నావిగేషన్, సెన్సార్లు, ఆయుధ వ్యవస్థలను కలిగి ఉంది. దీని ద్వారా పగలు, రాత్రి మరియు అన్ని రకాల వాతావరణంలో లక్ష్యం గురించి సమాచారం సులభంగా లభిస్తుంది.

ఇక చినూక్ సిహెచ్ -47 ఎఫ్ (ఐ) యొక్క తాజా వెర్షన్‌ను భారత వైమానిక దళం కొనుగోలు చేసింది. ప్రపంచవ్యాప్తంగా ఇరవై దేశాలు ఎయిర్ ఫోర్స్‌లో చినూక్ ఛాపర్‌ లను కొనుగోలు చేశాయి. చినూక్ 50 సంవత్సరాలుగా ప్రపంచంలోనే అత్యంత విశ్వసనీయమైన హెవీ-లిఫ్ట్ హెలికాప్టర్ అని బోయింగ్ ఒక ప్రకటనలో తెలిపింది. ఇది వేడి వాతావరణం, ఎత్తు, బలమైన గాలుల క్రింద కూడా సులభంగా ఎగురుతుంది.


Show Full Article
Print Article
Next Story
More Stories