న్యూఇయర్ కానుకుగా కరోనా వ్యాక్సినేషన్‌కు కేంద్రం కసరత్తులు

న్యూఇయర్ కానుకుగా కరోనా వ్యాక్సినేషన్‌కు కేంద్రం కసరత్తులు
x
Highlights

న్యూఇయర్ కానుకగా భారత ప్రభుత్వం దేశ ప్రజలకు కరోనా వ్యాక్సిన్‌ అందించడానికి కసరత్తులు చేస్తోంది. తాజాగా ఆక్స్‌ఫర్డ్-ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్‌ పంపిణీకి...

న్యూఇయర్ కానుకగా భారత ప్రభుత్వం దేశ ప్రజలకు కరోనా వ్యాక్సిన్‌ అందించడానికి కసరత్తులు చేస్తోంది. తాజాగా ఆక్స్‌ఫర్డ్-ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్‌ పంపిణీకి బ్రిటన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. ఈ వ్యాక్సిన్‌కు భారత్‌లోనూ అనుమతి లభిస్తుందని చర్చజరుగుతోంది. ఒకవేళ ఆస్ట్రాజెనెకా కాకపోతే ఏ వ్యాక్సిన్‌కు ప్రభుత్వం అనుమతినిచ్చే అవకాశాలున్నాయని హాట్‌ టాపిక్‌గా మారింది.

తాజాగా ఎయిమ్స్ చీఫ్ డాక్టర్ రణదీప్ గులేరియా ఈ అంశాలపై స్పందించారు. ప్రస్తుతం తమ వద్ద వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్‌, ఆస్ట్రాజెనెకాకు సంబంధించి సీరమ్ ఇనిస్టిట్యూట్‌ డేటాలు ఉన్నాయన్నారు. అంటే ఈ రెండింటిలో ఏదో ఒక వ్యాక్సిన్‌కు కేంద్రం ఆమోద ముద్ర వేసే అవకాశాలు ఉన్నాయని పలువురు భావిస్తున్నారు.

ఆక్స్‌ఫర్డ్-ఆస్ట్రాజెనెకా సంయుక్తంగా తయారుచేస్తున్న కోవీషీల్డ్, అమెరికా ఫార్మా సంస్థ ఫైజర్‌, భారత్ బయోటెక్‌లు వ్యాక్సిన్ అనుమతులు కోరుతూ ఇప్పటికే కేంద్రానికి దరఖాస్తులు చేసుకున్నాయి. వీటిల్లో దేనికి ఇప్పటివరకూ అనుమతులు మంజూరు చేయలేదు. సబ్జెక్ట్ ఎక్స్‌పర్ట్ కమిటీ వీటి నుంచి మరింత డేటాను కోరాయి. అదనపు డేటా కోసం ఫైజర్ గడువు కోరగా భారత్ బయోటెక్, సీరమ్ ఇనిస్టిట్యూట్ ఇప్పటికే ఆ డేటాను సమర్పించాయి.

ప్రస్తుతం సబ్జెక్ట్ ఎక్స్‌పర్ట్ కమిటీ ఈ డేటాలను పరిశీలిస్తోంది. అందులో భాగంగా ఈరోజు ఈ కమిటీ మరోసారి సమావేశమై భారత్‌లో ఎమర్జెన్సీ వ్యాక్సిన్‌పై చర్చించనుంది. ఈ నేపథ్యంలో వ్యాక్సిన్‌పై కీలక ప్రకటన వచ్చే అవకాశం ఉందా అన్న ఆసక్తి నెలకొంది.

Show Full Article
Print Article
Next Story
More Stories