
కరోనా కట్టడికి ఉపయోగే పడే హైడ్రాక్సీ క్లోరోక్విన్ ని కావాలని అమెరికా అధ్యక్షుడు భారత్ ని కోరిన సంగతి తెలిసిందే..
కరోనా కట్టడికి ఉపయోగే పడే హైడ్రాక్సీ క్లోరోక్విన్ ని కావాలని అమెరికా అధ్యక్షుడు భారత్ ని కోరిన సంగతి తెలిసిందే.. ట్రంప్ కొరిక మేరకు భారత్ ఆ దేశానికి క్లోరోక్విన్ మాత్రలను సరఫరా చేసింది. భారత్ చేసిన ఈ సహాయానికి గాను అమెరికా అధ్యక్షుడు డోనాల్ ట్రంప్ ట్విట్టర్ వేదికగా ధన్యవాదాలు తెలుపుతూ మోదీని అద్భుతమైన వ్యక్తిగా అభివర్ణించారు. అంతేకాకుండా భారత ప్రజలకు సైతం ధన్యవాదాలు తెలిపారు ట్రంప్ .. భారత్ చేసిన ఈ సహయాన్నీ ఎప్పుడూ మరిచిపోమన్నారు.
సాధారణ పరిస్థితుల్లో స్నేహితుల మధ్య మరింత సహకారం అవసరమని అభిప్రాయపడ్డారు. ట్రంప్ చేసిన ట్వీట్ కి మోడీ రీప్లై ఇచ్చారు. విపత్కర పరిస్థితులే మిత్రులను మరింత దగ్గర చేస్తాయన్నారు. భారత్-అమెరికా సంబంధాలు ఇదివరకు ఎన్నడూ లేనంతగా మరింత బలపడుతున్నాయన్నారు. కోవిడ్‌పై పోరాటానికి భారత్ చేయగలినంతా చేస్తుందన్నారు. కరోనా వైరస్‌ను కలికికట్టుగా ఎదుర్కొంటూ విజయం సాధిద్దామని మోడీ పేర్కొన్నారు..
ఇక భారత్ లో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. గురువారం ఉదయానికి దేశంలో కరోనా బాధితుల సంఖ్య 5734కి చేరిందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ వెల్లడించింది. వీరిలో 166మంది మరణించగా 5095 మంది ప్రస్తుతం చికిత్స పొందుతున్నారని ప్రకటించింది. మరో 473మంది కొవిడ్-19 నుంచి కోలుకున్నారు. ఇక అగ్రరాజ్యం అమెరికా విషయానికి వచ్చేసరికి కరోనా కేసులు 4 లక్షల 50 వేలకు చేరుకున్నాయి.
Fully agree with you President @realDonaldTrump. Times like these bring friends closer. The India-US partnership is stronger than ever.
— Narendra Modi (@narendramodi) April 9, 2020
India shall do everything possible to help humanity's fight against COVID-19.
We shall win this together. https://t.co/0U2xsZNexE

About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire




