India takes Taliban: పాకిస్థాన్‌తో కటీఫ్‌.. ఇండియాతో దోస్తీ.. రూటు మార్చిన తాలిబన్!

India takes Taliban
x

India takes Taliban: పాకిస్థాన్‌తో కటీఫ్‌.. ఇండియాతో దోస్తీ.. రూటు మార్చిన తాలిబన్!

Highlights

India takes Taliban: అఫ్గాన్ కూటమిలో భారత్ అభివృద్ధి, మిత్రత్వానికి తలుపులు తెరచడం ఈ దిశలో కీలక మార్గంగా నిలవొచ్చు.

India takes Taliban: పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్ పాక్‌పై ఒత్తిడిని పెంచే దిశగా కీలక వ్యూహాత్మక అడుగులు వేస్తోంది. దాదాపు దూరంగా ఉన్న సంబంధాల మధ్య భారత ప్రభుత్వం ఇప్పుడు ఆఫ్ఘానిస్థాన్‌లోని తాలిబాన్ ప్రభుత్వాన్ని సంప్రదించటం విశేషంగా మారింది. పాక్‌కు దశాబ్దాలుగా మద్దతుగా నిలిచిన తాలిబాన్‌ ఇప్పుడు భారత్‌తో మిత్రత వైపు అడుగులు వేయడం పాక్‌ను మరింత ఒంటరిపరిచేలా చేస్తోంది.

భారత ప్రభుత్వ ప్రతినిధులు ఇటీవల కాబూల్‌లో తాలిబాన్‌ విదేశాంగ మంత్రితో సమావేశమయ్యారు. ఇటు తాలిబాన్‌ ప్రభుత్వం పహల్గాం దాడిని ఖండిస్తూ అధికారికంగా ప్రకటన చేసింది. ఉగ్రవాదాన్ని తాము ప్రోత్సహించబోమని తాలిబాన్ చెప్పడం పాక్‌కు ఘాటు హెచ్చరికలా మారింది. 2021లో తాలిబాన్ అధికారం చేపట్టిన తర్వాత భారత్-ఆఫ్ఘాన్ మధ్య ఇది తొలి పొలిటికల్ కాంటాక్ట్ కావడం గమనార్హం.

ఇదే సమయంలో, ప్రధాని నరేంద్ర మోదీ భారత సైన్యానికి పూర్తి స్వేచ్ఛ ఇచ్చారు. సమయం, విధానం, లక్ష్యాలపై నిర్ణయం తీసుకోవడం వారిదే. ఇది పాక్‌పై కఠిన ప్రతిస్పందనకు భారత్ సిద్ధమవుతోందని సంకేతమిస్తోంది. ఇక పాక్ మాత్రం అల్లకల్లోలంగా తయారైంది. బలగాలను సరిహద్దులకు తరలిస్తూ, టెర్రరిస్టులను బంకర్లకు తరలిస్తూ, ప్రపంచ దేశాలను ఆశ్రయిస్తూ బెదిరింపులకు దిగుతోంది. పాక్ మంత్రి తమపై భారత దాడి త్వరలో జరిగే అవకాశముందని కూడా చెబుతున్నారు.

తాలిబాన్‌తో భారత్ చర్చలు జరిపిన దృశ్యం ఈ నేపథ్యంలో పెద్ద పరిణామంగా మారింది. తాలిబాన్ భారత మానవతా సహాయాన్ని స్వీకరించడం, వాణిజ్య సంబంధాలకు ఆసక్తి చూపడం కూడా ఈ దిశగా నడిపిస్తోంది. మరోవైపు పాక్‌తో తాలిబాన్‌ సంబంధాలు ఇప్పటికే గాడితప్పాయి. ఉగ్రవాద కార్యకలాపాలకు తాలిబాన్‌ను బాధ్యుడిగా నిలిపేందుకు పాక్ ప్రయత్నిస్తున్న నేపథ్యంలో తాలిబాన్ భారత్‌కు దగ్గరవడం ఐసిఎస్‌కు ముష్కిలుగా మారుతోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories