దేశవ్యాప్తంగా పెరిగిన రోడ్డు ప్రమాదాలు.. 2025లో భారీగా పెరిగిన రోడ్డు ప్రమాదాలు

దేశవ్యాప్తంగా పెరిగిన రోడ్డు ప్రమాదాలు.. 2025లో భారీగా పెరిగిన రోడ్డు ప్రమాదాలు
x

దేశవ్యాప్తంగా పెరిగిన రోడ్డు ప్రమాదాలు.. 2025లో భారీగా పెరిగిన రోడ్డు ప్రమాదాలు

Highlights

దేశ వ్యాప్తంగా రోడ్డు ప్రమాదాలు పెరిగిపోతున్నాయి. ర్యాష్ డ్రైవింగ్, నిర్లక్ష్యపు డ్రైవింగ్, డంక అండ్ డ్రైవ్, ఓవర్ టేక్ కారణంగా ఈ ప్రమాదాలు జరుగుతున్నాయి.

దేశ వ్యాప్తంగా రోడ్డు ప్రమాదాలు పెరిగిపోతున్నాయి. ర్యాష్ డ్రైవింగ్, నిర్లక్ష్యపు డ్రైవింగ్, డంక అండ్ డ్రైవ్, ఓవర్ టేక్ కారణంగా ఈ ప్రమాదాలు జరుగుతున్నాయి. ఎందరో ప్రయాణికులు ఈ ప్రమాదంలో ప్రాణాలు విడుస్తున్నారు. తరచూ ఎక్కడో ఒక ప్రాంతంలో ఈ ఘటనలు చేసుచేసుకుంటున్నాయి. పదుల సంఖ్యలో మృతి చెందుతున్నారు. వీటిపై అధికారులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా ప్రమాదాల సంఖ్య తగ్గడం లేదు. దేశంలో జరుగుతున్న రకరకాల సమస్యలతో పోల్చితే.. రోడ్డు ప్రమాదాల ద్వారా చనిపోయిన వారి సంఖ్యే ఎక్కువ.. మన దేశంలో ప్రమాదాల తీవ్రత ఆ స్థాయిలో ఉంది.

2025 ప్రారంభం నుంచి రోడ్డు ప్రమాదాలు ఎక్కువయ్యాయి. టెక్నాలజీ పెరిగింది. సాంకేతిక పెరిగింది. బస్సుల్లో సౌకర్యాలు పెరిగాయి.. కానీ భద్రతను అందరూ గాలికొదిలేసారు. టైమ్ విలువ పెరిగింది.. దీంతో తక్కువ సమయంలో గమ్యం చేరాలనే తాపత్రయం పెరిగింది. ఫలితంగా తరచూ ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి..

ఫిబ్రవరి నెలలో కుంభమేళా సమయంలో ఘోర రోడ్డు ప్రమాదాలు జరిగాయి. ఎన్నో బస్సులు బోల్తా పడ్డాయి. మరెన్నో వాహనాలు ఢీ కొట్టుకున్నాయి. మధ్యప్రదేశ్‌లోని సిహోరా దగ్గర మినీ బస్సును భారీ సిమెంట్ ట్రక్కు ఢీకొంది. ఈ ప్రమాదంలో ఏడుగురు మృతి, మరో ఆరుగురికి తీవ్రగాయాలు అయ్యాయి. హైదరాబాద్ నుంచి కుంభమేళాకు వెళ్లి తిరిగివస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది.

ఫిబ్రవరి నెలలో తిరుపతిలోని సూళ్లురు పేట హైవేపై ట్రావెల్స్ బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో దాదాపు 17 మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే వారిని సమీపంలోని హాస్పిటల్‌కు తరలించారు. పుదుచ్చేరి నుంచి విజయవాడ వెళ్తుండగా ఈ ఘోర ప్రమాదం జరిగింది. మరో ఘటనలో ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బొగ్గు లారీని ఢీకొట్టిన రోడ్డు ప్రమాదం నెల్లూరు జిల్లా నాయుడుపేటలో జరిగింది. ఈ ప్రమాదంలో బస్సు డ్రైవరుతో సహా సుమారు 15 మందికి గాయాలయ్యారు. కాగా బస్సు క్లీనర్ అక్కడికక్కడే ప్రాణం వదిలాడు. ఇలాంటి చిన్న చిన్న ఘటనలన్నీ కలిపితే సుమారు 50 మందికి పైగా మృతి చెందడం విషాదం.

2013 అక్టోబర్ 30 వ తేదీన జరిగిన జబ్బర్ ట్రావెల్స్ బస్సు ప్రమాదం మహబూబ్‌నగర్ జిల్లా పాలెం దగ్గర జరిగింది. బెంగళూరు నుండి హైదరాబాద్‌కు వెళుతున్న వోల్వో బస్సు ఒక కారును ఓవర్‌టేక్ చేసే ప్రయత్నంలో కల్వర్టును ఢీకొని మంటల్లో చిక్కుకుంది. ఈ ప్రమాదంలో 45 మందికి పైగా ప్రయాణికులు మరణించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories