Corona: దేశంలో కొత్తగా 13,193 కరోనా కేసులు

India Reports 13,193 New Corona Cases
x

ఫైల్ ఇమేజ్ 

Highlights

దేశంలో గడచిన 24 గంటల్లో 13,193 మందికి కరోనా నిర్ధారణ

దేశంలో గడచిన 24 గంటల్లో 13,193 మందికి కరోనా నిర్ధారణ అయ్యిందని, అదే స‌మ‌యంలో 10,896 మంది కోలుకున్నారని కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఓ ప్రకటనలో పేర్కొంది. ఆ ప్రకటనలో వివరాల ప్రకారం దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,09,63,394 కు చేరింది. గడచిన 24 గంట‌ల సమయంలో 97 మంది కరోనా కారణంగా మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 1,56,111కు పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 1,06,67,741 మంది కోలుకున్నారు. 1,39,542 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది. ఇప్ప‌టివ‌ర‌కు 1,01,88,007 మందికి వ్యాక్సిన్ వేశారు.

తెలంగాణ లో కొత్తగా 163 పాజిటివ్ కేసులు

తెలంగాణ రాష్ట్రంలో నిన్న రాత్రి 8గంటల వరకు 24,920 కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించగా... కొత్తగా 163 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 2,97,113కి చేరింది. ఈ మేరకు వైద్య ఆరోగ్యశాఖ గురువారం ఉదయం బులిటెన్‌ విడుదల చేసింది. రాష్ట్రంలో నిన్న కరోనాతో ఇద్దరు మరణించారు. దీంతో మృతుల సంఖ్య 1,622కి చేరింది. కరోనా బారి నుంచి నిన్న 101 మంది కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకు కోలుకున్న బాధితుల సంఖ్య 2,93,791కి చేరింది. రాష్ట్రంలో ప్రస్తుతం 1,700 యాక్టివ్‌ కేసులు ఉన్నాయని, వారిలో 658 మంది హోం ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారని వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. రాష్ట్రంలో ఇప్పటి వరకు నిర్వహించిన కరోనా పరీక్షల సంఖ్య 83,85,870కి చేరింది.

ఏపీలో తగ్గు ముఖం పట్టిన కరోనా....

ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ వ్యాప్తి తగ్గుముఖం పట్టింది. అయితే, మరణాలు మాత్రం అదే స్థాయిలో కొనసాగుతున్నాయి. చాలా జిల్లాల్లో కొత్త కేసులు రెండులోపే నమోదయ్యాయి. డిశ్చార్జీలు పెరగడంతో యాక్టివ్ కేసులు ఇంకా దిగువకు చేరాయి...

Show Full Article
Print Article
Next Story
More Stories