పాకిస్థాన్, బంగ్లాదేశ్‌ కంటే దిగజారిన భారత్

పాకిస్థాన్, బంగ్లాదేశ్‌ కంటే దిగజారిన భారత్
x
Highlights

పేదరిక నిర్మూలనకు ఎన్నో కార్యక్రమాలు చేపట్టామని ప్రభుత్వాలు చెబుతున్నాప్పటికీ దేశంలో ఆకలితో అలమటించేవారు రోజురోజుకు పెరిగిపోతున్నారు. ఆహార భద్రత కల్పించడం ప్రభుత్వాలు విఫలమైయ్యాయి.

భారతదేశంలో పేదలు ఉన్నారు కానీ పేద దేశం కాదు, భారతదేశం అభివృద్ధి చెందుతున్న దేశం, ఇలా ఎప్పటి నుంచో వింటూనే ఉన్నాం. పేదరిక నిర్మూలనకు ఎన్నో కార్యక్రమాలు చేపట్టామని ప్రభుత్వాలు చెబుతున్నాప్పటికీ దేశంలో ఆకలితో అలమటించేవారు రోజురోజుకు పెరిగిపోతున్నారు. ఆహార భద్రత కల్పించడం ప్రభుత్వాలు విఫలమైయ్యాయి.

ప్రపంచ ఆకలి సూచీ -2019 ప్రకారం భారత్‌ కంటే పాకిస్థాన్, నేపాల్, బంగ్లాదేశ్‌లు మెరుగైన స్థానంలో నిలిచాయి. జీహెచ్‌ఐ గణంకాల ప్రకారం 2015లో 93వ స్థానంలో భారత్ ఇప్పుడు 102వ స్థానానికి దిగజారింది. మొత్తం 117 దేశాల్లో పలు అంశాలను ప్రామాణికంగా జాబితాను రూపొందించారు. భారతదేశం కంటే పాకిస్థాన్ 94వ స్థానంలో ఉంటే, బంగ్లాదేశ్ 88వ స్థానంలో ఉంది. ఇక నేపాల్ 73, దక్షిణాఫ్రికా 59 స్థానాల్లో ఉన్నాయి. ప్రతి ఏటా అధ్యయనం కోసం తీసుకునే దేశాల సంఖ్య మారుతూ ఉంటుంది. ఈ ఏడాది మొత్తం 117 దేశాల్లో భారత్ 102వ స్థానంలో నిలువడంతో నిపుణులను సైతం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories