ఈఏడు 100% వర్షం కురిసే అవకాశం.. ఎందుకంటే..

ఈఏడు 100% వర్షం కురిసే అవకాశం.. ఎందుకంటే..
x
Highlights

నైరుతి రుతుపవనాల కాలంలో (జూన్‌- సెప్టెంబర్‌) ఈ ఏడాది దేశవ్యాప్తంగా సాధారణ వర్షం కురుస్తుందని భూ విజ్ఞాన శాస్త్ర కార్యదర్శి ఎం.రాజీవన్‌, భారత వాతావరణ విభాగం (ఐఎండీ) డైరెక్టర్‌ జనరల్‌ ఎ.మహాపాత్ర ప్రకటించారు.

నైరుతి రుతుపవనాల కాలంలో (జూన్‌- సెప్టెంబర్‌) ఈ ఏడాది దేశవ్యాప్తంగా సాధారణ వర్షం కురుస్తుందని భూ విజ్ఞాన శాస్త్ర కార్యదర్శి ఎం.రాజీవన్‌, భారత వాతావరణ విభాగం (ఐఎండీ) డైరెక్టర్‌ జనరల్‌ ఎ.మహాపాత్ర ప్రకటించారు.ఈ ఏడాది రుతుపవనాల రాకపై అంచనాలను వారు బుధవారం వెల్లడించారు. ఈ ఏడాది దీర్ఘకాల సగటు (ఎల్‌పీఏ)లో 100% (5% అటూ ఇటూగా) వర్షపాతం ఈసారి నమోదయ్యే అవకాశం ఉన్నట్లు ఐఎండీ ప్రకటించింది.. ఇక జూన్ 1 న రుతుపవనాలు కేరళను తాకనున్నాయని.

భారతదేశంలోని అనేక ఇతర ప్రాంతాలలో రుతుపవనాల ప్రారంభ , ముగింపు తేదీని IMD సవరించింది. మహారాష్ట్ర, గుజరాత్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గడ్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, జార్ఖండ్, బీహార్ మరియు ఉత్తర ప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాల్లో రుతుపవనాలు ప్రస్తుత సాధారణ తేదీలతో పోలిస్తే 3 నుంచి 7 రోజులు ఆలస్యం అవుతాయి.

ఏదేమైనా, వాయువ్య భారతదేశంలో, రుతుపవనాలు జూలై 15 తో పోలిస్తే కొంచెం ముందుగానే వస్తాయని పేర్కొంది. నైరుతి రుతుపవనాల చివరి దశ ఉపసంహరణ మాత్రం ఎప్పటిలా అక్టోబర్‌ 15న జరుగుతుందని స్పష్టం చేశారు. హైదరాబాద్‌, విశాఖపట్నాల్లో రుతుపవనాల ఉపసంహరణ ఒకరోజు ముందే జరుగుతుందన్నారు. కాగా పసిఫిక్ మహాసముద్రంపై న్యూట్రల్ ఎల్ నినో సదరన్ ఆసిలేషన్ (ENSO) పరిస్థితులు ఉన్నాయని.. అలాగే హిందూ మహాసముద్రంలో న్యూట్రల్ హిందూ మహాసముద్రం డిపోల్ (IOD) పరిస్థితులు ఉన్నాయని. రాబోయే వర్షాకాలంలో ఈ పరిస్థితులు కొనసాగే అవకాశం ఉందని కొన్ని వాతావరణ నమూనా సూచనలు సూచిస్తున్నాయి.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories