భారత్ లో వేగంగా పరుగులు తీస్తున్న కరోనా! ఎవరికీ వారు జాగ్రత్తగా ఉండాల్సిందే!

భారత్ లో వేగంగా పరుగులు తీస్తున్న కరోనా! ఎవరికీ వారు జాగ్రత్తగా ఉండాల్సిందే!
x
Highlights

భారత్‌ లో కరోనా ప్రభావం తగ్గిందని కొట్టిపారేయలేం. పరిస్థితులు చక్కబడుతున్నాయని సంకలు గుద్దుకోవద్దు. ఇండియాలో కరోనా వేగంగా పరుగులు...

భారత్‌ లో కరోనా ప్రభావం తగ్గిందని కొట్టిపారేయలేం. పరిస్థితులు చక్కబడుతున్నాయని సంకలు గుద్దుకోవద్దు. ఇండియాలో కరోనా వేగంగా పరుగులు పెడుతోంది. పెరుగుతున్న కరోనా కేసులు భయాందోళనకు గురిచేస్తోంది. అత్యధిక కరోనా కేసులు సంభవిస్తున్న దేశంగా ఇండియా రెండో ప్లేస్ కి చేరువైంది. రోజు రోజుకు కరోనా కేసులు పెరగడంతో దేశ ప్రజలు ఆందోళన చెందుతున్నారు. దేశంలో లాక్ డౌన్ సడలింపులు జరిగిపోయాయి. అన్ని షాపులు ఓపెన్ అయ్యాయి. జనాలు దర్జాగా తిరుగుతున్నారు. కానీ పరిస్థితులు భయనకంగానే ఉన్నాయి. పెరుగుతున్న కరోనా కేసులు దేశ ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. నిత్యం వేలకు పైగా కేసులు, వెయ్యికి పైగా మరణాలు నమోదవుతున్నాయంటే భారత్ లో పరిస్థితులు ఎలా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు.

దేశవ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో 90,802 పాజిటివ్‌ కేసులు నమోదవడంతో మొత్తం కేసుల సంఖ్య 42 లక్షలు దాటింది. 64,60,250 కేసులతో అమెరికా అగ్రస్థానంలో ఉండగా.. 42,04,614 కేసులతో భారత్‌ రెండో స్థానంలో, 4,137,606 కేసులతో బ్రెజిల్‌ మూడో స్థానంలో కొనసాగుతోంది. దేశంలో అన్ లాక్ ప్రక్రియ కొనసాగుతున్నప్పటికీ ప్రజలు అప్రమత్తంగా ఉండక తప్పదు. పెరుగుతున్న కేసులు, మరణాలు చూస్తే ఇంకా ఇండియాలో పరిస్థితులు చక్కబడలేదని అర్థం చేసుకోవాలి. ఎవరికి వారు జాగ్రత్తలు పాటిస్తేనే కరోనాను కాస్తైన కంట్రోల్ చేయగలుగుతాం.


Show Full Article
Print Article
Next Story
More Stories