కరోనా.. మరణ భయం లేదు.. జాగ్రత్తగా ఉండటమే ముఖ్యం!

కరోనా.. మరణ భయం లేదు.. జాగ్రత్తగా ఉండటమే ముఖ్యం!
x
Highlights

కరోనా ప్రపంచ దేశాలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నప్పటికీ వైరస్‌ సోకిన వారిలో సగం మందికి పైగా కోలుకోవడం ఊరటనిస్తుంది. ఇతర వ్యాధులు లేకుండా కేవలం కోవిడ్‌...

కరోనా ప్రపంచ దేశాలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నప్పటికీ వైరస్‌ సోకిన వారిలో సగం మందికి పైగా కోలుకోవడం ఊరటనిస్తుంది. ఇతర వ్యాధులు లేకుండా కేవలం కోవిడ్‌ కారణంగా చనిపోయిన వారి సంఖ్య చాలా స్వల్పంగా ఉంది. ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా 94 లక్షల కేసులు నమోదు కాగా 50.65 లక్షల మంది కోవిడ్‌ నుంచి కోలుకున్నారు. అత్యధిక రికవరీ రేటుతో ప్రపంచ దేశాల్లో భారత్ నాలుగో స్థానంలో ఉంది.

ప్రపంచంలో అమెరికా, బ్రెజిల్, రష్యా, భారత్‌ దేశాలను కరోనా వైరస్‌ భయపెడుతూనే ఉంది. ఈ దేశాల్లో కేసులు భారీగా నమోదవుతున్నాయి. కరోనా రోగుల రికవరీ రేటు 54 శాతంగా ఉంది. మన దేశంలో కరోనా వైరస్‌ సోకినా పెద్దగా భయపడాల్సిన పని లేదని కేంద్ర ఆరోగ్య శాఖ భరోసా ఇస్తుంది. 56.70శాతం రికవరీ రేటుతో భారత్‌ అత్యంత సురక్షితమైన స్థానంలో ఉంది. ప్రపంచవ్యాప్తంగా రికవరీ రేటుతో పోల్చి చూస్తే మనం మెరుగైన స్థానంలో ఉన్నాం. అంతేకాదు అత్యధిక రికవరీ రేటుతో ప్రపంచ దేశాల్లో నాలుగో స్థానంలో ఉంది. భారత్‌లో రాజస్తాన్‌ 78శాతం రికవరీ రేటుతో మొదటి స్థానంలో ఉంది.

భారత్‌లో మొత్తం కరోనా కేసుల సంఖ్య 4,90,401కి చేరుకోగా, మొత్తం మృతుల సంఖ్య 15,301కి చేరుకుంది. ప్రతీ లక్ష మంది జనాభా ప్రాతిపదికగా తీసుకుంటే మన దేశంలో మృతుల సంఖ్య అత్యల్పంగా ఉంది. ప్రపంచవ్యాప్తంగా ప్రతీ లక్ష మంది జనాభాకి ఆరుగురు కోవిడ్‌తో మరణిస్తే, భారత్‌లో ఆ సంఖ్య ఒక్కటి మాత్రమే. కోవిడ్‌ నుంచి కోలుకున్న వారు ఇప్పటివరకు 2 లక్షల 85 వేల మంది ఉన్నారు.

భారత్‌లో కరోనా కేసుల సంఖ్య నాలుగున్నర లక్షలు దాటినప్పటికీ వాటిలో సీరియస్‌ కేసులు కేవలం తొమ్మిది వేలు మాత్రమే ఉన్నాయి. మిగిలిన వారందరికీ వైరస్‌ స్వల్పంగా, మధ్యస్థంగా సోకింది. దీంతో రికవరీ రేటు ఎక్కువగా ఉంది. భారతీయుల జీవన విధానం, ఆహార అలవాట్లతో వారిలో రోగనిరోధక శక్తి ఎక్కువ. కరోనా వైరస్‌కు మందు లేకపోవడం వల్ల ఇమ్యూనిటీని పెంచడానికే మందులు ఇస్తున్నారు. ఈ తరహా చికిత్సకు భారతీయులు త్వరగా స్పందిస్తున్నారు

కోవిడ్‌–19 బారినపడి కోలుకున్న వారిలో జర్మనీ మొదటి స్థానంలో ఉంది. ఈ దేశంలో లక్షా 92 వేల కేసులు నమోదైతే, ఇప్పటివరకు లక్షా 75 వేల మందివరకు కోలుకున్నారు. ఆ తర్వాత స్థానంలో ఇరాన్, ఇటలీ నిలిచాయి. ఇక అగ్రరాజ్యం అమెరికాలో రికవరీ రేటు కూడా తక్కువగానే ఉంది. ఆ దేశంలో కోలుకున్న వారు 40శాతం మంది మాత్రమే ఉన్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories