E- Passport: ఈ-పాస్‌పోర్ట్‌ వచ్చేసింది.. అందరు అప్‌గ్రేడ్‌ చేసుకోవాల్సిందేనా?

India E-Passport Services Launched Benefits Cities Details 2025
x

E- Passport: ఈ-పాస్‌పోర్ట్‌ వచ్చేసింది.. అప్‌గ్రేడ్‌ చేసుకోవాల్సిందేనా?

Highlights

E- Passport: భారత పాస్‌పోర్ట్‌ వ్యవస్థను ఆధునీకరణ దిశగా కేంద్రం కీలక అడుగు వేసింది. విదేశాంగ శాఖ ఇటీవల ఈ-పాస్‌పోర్ట్‌ (E-Passport) సేవలను దేశంలో ప్రారంభించింది.

E- Passport: భారత పాస్‌పోర్ట్‌ వ్యవస్థను ఆధునీకరణ దిశగా కేంద్రం కీలక అడుగు వేసింది. విదేశాంగ శాఖ ఇటీవల ఈ-పాస్‌పోర్ట్‌ (E-Passport) సేవలను దేశంలో ప్రారంభించింది. 2024 ఏప్రిల్ 1న ప్రారంభమైన పాస్‌పోర్ట్‌ సేవా ప్రోగ్రామ్‌ (PSP) 2.0 పైలట్ ప్రాజెక్టులో భాగంగా ఇది తీసుకువచ్చారు.

ఈ-పాస్‌పోర్ట్‌ అంటే ఏమిటి?

సంప్రదాయ పాస్‌పోర్ట్‌లకు భిన్నంగా, ఈ-పాస్‌పోర్ట్‌ కవర్‌పై బంగారు రంగు చిన్న సింబల్‌ ఉంటుంది. ఇందులో ఎలక్ట్రానిక్ చిప్ మరియు రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ (RFID) టెక్నాలజీ ఉపయోగించారు.

ఈ చిప్‌లో పాస్‌పోర్ట్ హోల్డర్‌ వ్యక్తిగత, బయోమెట్రిక్ డాటా సేవ్ అయి ఉంటుంది. ఫలితంగా, అంతర్జాతీయ ప్రయాణాల సమయంలో ఇమ్మిగ్రేషన్ చెక్‌లు త్వరగా, సెక్యూర్‌గా పూర్తి చేయవచ్చు.

ఈ-పాస్‌పోర్ట్‌ ప్రస్తుతం అందుబాటులో ఉన్న నగరాలు

ప్రస్తుతం 13 నగరాల్లో మాత్రమే ఈ సేవ అందుబాటులో ఉంది. 2025 తొలి అర్ధభాగం పూర్తయ్యేలోపు దేశవ్యాప్తంగా అందుబాటులోకి తేవాలని కేంద్రం యోచిస్తోంది.

ఈ నగరాలు:

హైదరాబాద్‌, నాగ్‌పూర్‌, భువనేశ్వర్‌, జమ్ము, గోవా, సిమ్లా, రాయ్‌పూర్‌, అమృత్‌సర్‌, జైపూర్‌, చెన్నై, సూరత్‌, రాంచీ, ఢిల్లీ

అప్‌గ్రేడ్‌ అవసరమా?

ఇప్పటికే పాస్‌పోర్ట్ ఉన్నవారికి అప్‌గ్రేడ్‌ చేసుకోవడం ఆప్షనల్‌. ప్రస్తుత పాస్‌పోర్ట్‌లు ఎక్స్‌పైరీ డేట్‌ వరకు చెల్లుబాటు అవుతాయి.

ఈ-పాస్‌పోర్ట్‌ లాభాలు

భద్రత మరింత మెరుగవుతుంది — నకిలీ పాస్‌పోర్ట్‌, వ్యక్తిగత డేటా చోరీ నుండి రక్షణ

అంతర్జాతీయ ప్రయాణాలు వేగవంతం — ఇమ్మిగ్రేషన్ చెక్‌లు తక్కువ సమయంలో పూర్తవుతాయి

డేటా ఎన్‌క్రిప్షన్‌ (PKI ద్వారా) — సున్నితమైన సమాచారాన్ని అత్యంత సురక్షితంగా కాపాడుతుంది

Show Full Article
Print Article
Next Story
More Stories