Agni-5 Ballistic Missile: అగ్ని-5 బాలిస్టిక్ క్షిపణి ప్రయోగం విజయవంతం

India DRDO Launch Agni-5 Ballistic Missile Successfully | National News
x

Agni-5 Ballistic Missile: అగ్ని-5 బాలిస్టిక్ క్షిపణి ప్రయోగం విజయవంతం

Highlights

Agni-5 Ballistic Missile: భారత్ రక్షణ రంగంలో మరో పెద్ద ఘనతను సాధిచింది...

Agni-5 Ballistic Missile: భారత్ రక్షణ రంగంలో మరో పెద్ద ఘనతను సాధిచింది. దేశ ఆయుధ సంప‌త్తిని ప్రపంచానికి చాటేలా చేసింది. ఉపరితలం నుంచి ఉపరితలంపైకి ప్రయోగించే వీలున్న అగ్ని-5 బాలిస్టిక్‌ మిసైల్ ని భారత్ విజయవంతంగా పరీక్షించింది. ఈ ప్రయోగం ఒడిశా తీరంలోని ఏపీజే అబ్దుల్ కలాం ద్వీపం నుంచి ప‌రీక్షించారు.

డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్, భార‌త్ డైన‌మిక్స్ లిమిటెడ్ సంయుక్తంగా నిర్మించిన ఈ క్షిప‌ణి ప్రయోగం 2020లోనే జ‌రుగాల్సి ఉంది. అయితే క‌రోనా ప‌రిస్థితుల రీత్యా వాయిదా ప‌డింది. ప్రస్తుతం భార‌త్ -చైనా స‌రిహ‌ద్దుల ప్రతిష్ఠంభ‌న నేప‌థ్యంలో ఇండియా ఈ ప‌రీక్ష చేయ‌డం ఆస‌క్తిగా మారింది.

మూడు-దశల ఘన-ఇంధన ఇంజిన్‌ను ఉపయోగించే ఈ క్షిపణి 5వేల కిలోమీటర్ల పరిధి వరకు ఉన్న లక్ష్యాలను ఛేదించగలదు. క‌చ్చిత‌మై ల‌క్ష్యాల‌ను ఛేదించ‌డం ఈ క్షిప‌ణి ల‌క్షణం. గ‌తంలోని అగ్ని-1,2,3,4ల‌కు మించి అద‌నపు సామ‌ర్థ్యాన్ని ఈ క్షిప‌ణి క‌లిగి ఉంటుంది. ఇత‌రులు మ‌న దేశంపై దాడి చేస్తే త‌ప్ప ముందుగా ఈ క్షిప‌ణుల‌ను వాడొద్దనేది ఇండియా క‌ట్టుబాటు. డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ నిర్మించింది

క‌రోనా కార‌ణంగా గ‌తేడాది ప‌రీక్షించాల్సిన‌ క్షిప‌ణిని ఇప్పుడు ప్రయోగించామ‌ని ప్రభుత్వం చెబుతున్నా... అంత‌ర్జాతీయ స‌మాజం ఈ పరీక్షను మ‌రో కోణంలోనే చూస్తున్నాయి. ఇప్పుడు ఈ క్షిప‌ణి ప్రయోగం, ప‌నితీరును ఇండియా ప‌రీక్షించింది. ఈ క్షిప‌ణి సామ‌ర్థ్యం 5వేల కిలోమీట‌ర్లు అంటే చైనాలో దాదాపు ప్రతీ చోట‌కు వెళ్లేలా దీన్ని ప్రయోగించ‌వ‌చ్చనే వాద‌న‌లు ఉన్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories