భారత్‌లో బయటపడ్డ కరోనా వైరస్ కొత్త స్ట్రెయిన్

భారత్‌లో బయటపడ్డ కరోనా వైరస్ కొత్త స్ట్రెయిన్
x
Highlights

దేశంలోకి కొత్తరకం కరోనా మహమ్మారి ప్రవేశించింది. యూకే నుంచి వచ్చిన ఆరుగురిలో ఈ వైరస్‌ను గుర్తించినట్టు కేంద్రం ప్రకటించింది. బెంగళూరులో ముగ్గురు,...

దేశంలోకి కొత్తరకం కరోనా మహమ్మారి ప్రవేశించింది. యూకే నుంచి వచ్చిన ఆరుగురిలో ఈ వైరస్‌ను గుర్తించినట్టు కేంద్రం ప్రకటించింది. బెంగళూరులో ముగ్గురు, హైదరాబాద్‌లో ఇద్దరు, పుణేలో ఒకరికి కొత్తరకం కరోనా వైరస్ నిర్ధారణ అయినట్టు అధికారులు తెలిపారు. బెంగళూరులోని నిమ్‌హన్స్‌లో మూడు, హైదరాబాద్‌లోని సీసీఎంబీలో రెండు, పుణెలోని ఎన్‌ఐవీలో ఒక కేసు నిర్ధారణ అయినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ అధికారంగా వెల్లడించింది. ప్రస్తుతం వీరికి ఆయా రాష్ట్రాల్లోని కోవిడ్ కేర్ సెంటర్‌లలో చికిత్స కొనసాగుతోందని తెలిపింది. వారితో ప్రయాణించిన వ్యక్తులు, కుటుంబసభ్యులు, కాంటాక్ట్ అయిన వారిని గుర్తించినట్టు పేర్కొన్నారు. కొత్త కరోనా తాజా నిబంధనల ప్రకారం యూకే వైరస్‌ పాజిటివ్‌గా తేలిన వారిలో చికిత్స అనంతరం పరీక్షల్లో రెండుసార్లు నెగెటివ్‌ వస్తేనే పూర్తిస్థాయిలో దాని ముప్పు తొలగిపోయినట్లుగా నిర్ధారిస్తారు.

కరోనా స్ట్రెయిన్‌పై కేంద్రం కీలక ప్రకటన చేసింది. అంతర్జాతీయ ప్రయాణికులకు జినోమ్‌ సీక్వెన్సింగ్ తప్పనిసరని స్పష్టం చేసింది. జినోమ్‌ సీక్వెన్సింగ్‌ కోసం 10 ప్రభుత్వ ల్యాబ్‌ల ఏర్పాటు చేశామని వైద్యాధికారులు తెలిపారు. డిసెంబర్ 9 నుంచి 22 వరకు వచ్చిన ప్రయాణికులకు టెస్టులు తప్పనిసరని తేల్చిచెప్పారు. స్ట్ర్రెయిన్‌పై వాక్సిన్‌ ప్రభావం ఉండదనడానికి ఆధారాలు లేవని కేంద్ర వైద్యఆరోగ్యశా‌ఖ అధికారులు తెలిపారు.

Show Full Article
Print Article
Next Story
More Stories