Passports: శక్తిమంతమైన పాస్‌పోర్టుల జాబితాలో మెరుగుపడిన భారత్‌ ర్యాంక్‌.. 59 దేశాలకు వీసా ఫ్రీ ఎంట్రీ

Passports: శక్తిమంతమైన పాస్‌పోర్టుల జాబితాలో మెరుగుపడిన భారత్‌ ర్యాంక్‌.. 59 దేశాలకు వీసా ఫ్రీ ఎంట్రీ
x

Passports: శక్తిమంతమైన పాస్‌పోర్టుల జాబితాలో మెరుగుపడిన భారత్‌ ర్యాంక్‌.. 59 దేశాలకు వీసా ఫ్రీ ఎంట్రీ

Highlights

Passports: ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన పాస్‌ పోర్టుల దేశాల లిస్ట్‌లో భారత్‌ గతేడాది కంటే మెరుగుపడింది.

Passports: ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన పాస్‌ పోర్టుల దేశాల లిస్ట్‌లో భారత్‌ గతేడాది కంటే మెరుగుపడింది. ఈ సారి 77వ స్థానానికి చేరి మెరుగుపడింది. అయితే వీసా ఫ్రీ ఎంట్రీగా మాత్రం 62 నుంచి 59కి పడింది. మలేషియా, మాల్దీవులు, ఇండోనేషియా, థాయ్‌లాండ్ వంటి దేశాలు వీసా లేకుండా ప్రవేశాన్ని అనుమతిస్తున్నాయి. అయితే శ్రీలంక, మాకావు, మయన్మార్ వంటి దేశాలు మాత్రం భారతీయులకు వీసా ఆన్ అరైవల్‌ సౌకర్యాన్ని కల్పిస్తున్నాయి.

వీసా రహితంగా ట్రావెల్ చేయగలిగిన గమ్యస్థానాల ఆధారంగా హెన్లీ పాస్ పోర్ట్ ఇండెక్స్, 2025 ఈ ర్యాంకులను ప్రకటించింది. మొత్తం 199 దేశాల్లో అత్యంత శక్తిమంతమైన పాస్ పోర్టుల జాబితాను వెల్లడించింది. ఈ జాబితాలో సింగ్ పూర్ పాస్ట్ పోర్టు అగ్రస్థానంలో ఉంది. ఇక ఈ దేశ పాస్ పోర్టుతో 199 దేశాలకు వీసా అవసరం లేకుండానే వెళ్లొచ్చు.

ఇక భారత దేశం విషయానికి ఈ సారి వీసా ఫ్రీ ఎంట్రీ గా ప్రయాణించగల దేశాల సంఖ్య 62 నుంచి 59కి పడిపోయింది. అంటే భారత్ దేశ పాస్ పోర్టుతో 59 దేశాలు వీసా లేకుండా ఫ్రీగా తిరిగి రావచ్చు. ఇక ఈ జాబితాలో జపాన్, దక్షిణ కొరియా రెండో స్థానంలో నిలబడి.. 190 దేశాలు వీసా లేకుండా చుట్టిరావచ్చు. అయితే ఈ జాబితాలో ఆఫ్గనిస్తాన్ చిట్ట చివరి స్థానంలో నిలిచింది. ఆ దేశ పాస్ పోర్టుతో కేవలం 25 దేశాలకు మాత్రమే వీసా ఫ్రీ ఎంట్రీ ఉంటుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories