India Vs England: 365 పరుగులకు భారత్ ఆలౌట్

India Vs England: భారత్ ఇంగ్లండ్ మధ్య జరుగుతున్న నాలుగో టెస్టు టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 365 పరుగులకు ఆలౌటైంది.

Kranthi
Updated on: 6 March 2021 1:09 PM IST
India all out for 365 Runs in India Vs England 4th Test Match
X

ఫైల్ ఇమేజ్


India Vs England: మెుతేరా స్టేడియంలో భారత్ ఇంగ్లండ్ మధ్య జరుగుతున్న నాలుగో టెస్టు టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 365 పరుగులకు ఆలౌటైంది. 294/7 ఓవర్‌నైట్ స్కోర్‌తో మూడో రోజు ఆట కొనసాగించిన భారత్ మరో 71 పరుగులు జోడించి మిగతా మూడు వికెట్లు కోల్పోయింది. వాషింగ్టన్ సుందర్(96 నాటౌట్), అక్షర్ పటేల్(43) ద్వయం ఎనిమిదో వికెట్‌కు శతక(106) భాగస్వామ్యం నెలకొల్పడం విశేషం.

అక్షర్ రనౌట్‌గా వెనుదిరిగిన తర్వాత క్రీజులోకి వచ్చిన ఇషాంత్, సిరాజ్ వెంటవెంటనే పెవిలియన్ బాటపట్టడంతో సుందర్ సెంచరీకి 4 పరుగుల దూరంలో ఉండిపోయాడు. అంతకుముందు యువ వికెట్ కీపర్ రిషబ్ పంత్(101) శతకంతో కోహ్లీ సేన భారీ స్కోర్‌కు పునాది వేయగా.. అక్షర్, సుందర్ జోడి దానిని కొనసాగించింది. భార‌త్-ఇంగ్లండ్ మ‌ధ్య అహ్మ‌దాబాద్‌లో జ‌రుగుతోన్న నాలుగో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో భార‌త్‌ 365 పరుగుల స్కోర్ సాధించింది. తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ 205 ప‌రుగుల‌కే ఆలౌటైన విష‌యం తెలిసిందే. దీంతో తొలి ఇన్నింగ్స్‌లో భార‌త్ 160 ప‌రుగుల ఆధిక్యాన్ని సాధించింది. ‌

Kranthi

Kranthi

Next Story