Independence Day 2020: దేశ ప్రజలందరికీ ఆధార్ తరహాలో ఆరోగ్య కార్డులు..ప్రధాని మోడీ ప్రకటన

Health cards for all citizens like Adhar cards
x
Modi addressing the nation from Red Fort
Highlights

Independence Day 2020: అందరికీ హెల్త్ కార్డులు ఎర్రకోట వద్ద ప్రసంగంలో ప్రకటించిన ప్రధాని మోడీ

స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా ఎర్రకోట వేదికగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కీలక ప్రకటన చేశారు. దేశ 74వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రధానమంత్రి తన ప్రసంగంలో ఒక దేశం ఒక ఆరోగ్య కార్డు పధకాన్ని ప్రకటించారు.

ప్రధాని ఈ పధకం ఎలా ఉండబోతోందో చెప్పారు. దాని ప్రకారం..

- దేశవ్యాప్తంగా ప్రతి పౌరుడి ఆరోగ్య రికార్డులను డిజిటల్‌ రూపంలో భద్రపరిచేందుకు ఈ పధకాన్ని చేపడుతున్నారు. ఒక దేశం ఒక ఆరోగ్య కార్డు పధకంలో భాగంగా వ్యక్తికి జరిగిన చికిత్సలు, పరీక్షలు సహా వైద్య చరిత్ర అంతటినీ డిజిటలీకరించి ఈ కార్డులో భద్రపరుస్తారు.

- ఆస్పత్రులు, క్లినిక్‌లు, వైద్యులను కేంద్ర సర్వర్‌తో అనుసంధానిస్తారు. ఈ పధకాన్ని ఉపయోగించుకోవాలా లేదా అనే నిర్ణయాన్ని పూర్తిగా ఆస్పత్రులు, పౌరులకే నిర్ణ యాధికారం

- ఈ కార్డును కోరుకున్న వారికి ఓ యూనిక్‌ ఐడీ. ఈ ఐడీ ద్వారా వారు సిస్టమ్‌లోకి లాగిన్‌

- దశలవారీగా అమలు చేసే ఈ పధకానికి రూ 300 కోట్ల బడ్జెట్‌ కేటాయింపులు .

- ఈ పథకం ప్రయోజనాల్లో కీలకమైనది ఏంటంటే దేశంలో ఏ వైద్యుడు, ఆస్పత్రిని సందర్శించే వ్యక్తి తన వెంట వైద్య పరీక్షల రిపోర్టులు, ప్రిస్క్రిప్షన్లు తీసుకువెళ్లాల్సిన అవసరం ఉండదు.

- యూనిక్‌ ఐడీ ద్వారా రోగికి సంబంధించిన పూర్తి వివరాలు, రికార్డులను వైద్యులు పరిశీలిన

- ఆధార్‌ కార్డు తరహాలో హెల్త్‌ కార్డును జారీ .దేశంలో వైద్యారోగ్య పరిస్ధితిని పూర్తిగా మార్చేందుకు ఉద్దేశించిన ఈ పధకంలో పౌరుల వ్యక్తిగత సమాచారం భద్రంగా ఉండేలా చర్యలు

- ఈ పధకాన్ని మందుల షాపులు, వైద్య బీమా కంపెనీలకూ సర్వర్‌లో అనుసంధానం.

- రోగి అనుమతితోనే వైద్యులు, ఆస్పత్రి వర్గాలు వ్యక్తి రికార్డులను పరిశీలించేందుకు అనుమతి

ఢిల్లీ లో ఘనంగా జరిగిన 74వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలలో ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఎర్రకోట వద్ద జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం అయన మాట్లాడుతూ పలు విషయాలను ప్రజలకు వివరించి చెప్పారు. అందులో భాగంగా ఈ ఆరోగ్య కార్డుకు సంబంధించిన ప్రకటన చేశారు. .


Show Full Article
Print Article
Next Story
More Stories