Income Tax: ఇన్‌కమ్ ట్యాక్స్‌ డిపార్ట్‌మెంట్ హెచ్చరిక.. ఈ విషయంలో అప్రమత్తత అవసరం..!

Income Tax Department Warning People for Fake Jobs at itr Department
x

Income Tax: ఇన్‌కమ్ ట్యాక్స్‌ డిపార్ట్‌మెంట్ హెచ్చరిక.. ఈ విషయంలో అప్రమత్తత అవసరం..!

Highlights

Income Tax: ఒకవైపు పెరుగుతున్న ద్రవ్యోల్బణం, మరోవైపు నిరుద్యోగం దీంతో ఉద్యోగం సాధించడం విద్యావంతులకు సవాల్‌గా మారింది.

Income Tax: ఒకవైపు పెరుగుతున్న ద్రవ్యోల్బణం, మరోవైపు నిరుద్యోగం దీంతో ఉద్యోగం సాధించడం విద్యావంతులకు సవాల్‌గా మారింది. ఇదిలా ఉంటే మరోవైపు మోసగాళ్లు కూడా నిరుద్యోగులనే టార్గెట్‌ చేశారు. ఆదాయపు పన్ను శాఖలో ఉద్యోగాలు ఇప్పిస్తామని డబ్బులు గుంజుతూ మోసాలు చేస్తున్నారు. ఇటువంటి వాటిపై అప్రమత్తంగా ఉండాలని ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ డిపార్ట్‌మెంట్‌ హెచ్చరికలు జారీ చేసింది. ఇందుకు సంబంధించి సోషల్‌మీడియా వేదికగా ట్వీట్ కూడా చేసింది. ఉద్యోగాలు ఇప్పిస్తామనే మోసగాళ్ల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పేర్కొంది. ఇటీవల చాలా మందికి ఇన్‌కమ్‌ ట్యాక్స్‌కి సంబంధించి నకిలీ జాయినింగ్ లెటర్లు వచ్చాయి.

డిపార్ట్‌మెంట్‌లో గ్రూప్-బి, గ్రూప్-సిలోని ఉద్యోగాలను స్టాఫ్ సెలక్షన్ కమిటీ (ఎస్‌ఎస్‌సి) మాత్రమే జారీ చేస్తుందని ఆదాయపు పన్ను శాఖ తెలిపింది. ఈ పరిస్థితిలో మీరు ఇందులో ఉద్యోగం చేయాలనుకుంటే SSC యొక్క అధికారిక వెబ్‌సైట్‌లో మొత్తం సమాచారం ఉంటుందని తెలిపింది. ఎవరినైనా నమ్మి నకిలీ ఉద్యోగాల బారిన పడి మోసపోవద్దని సూచించింది.

ఎలాంటి గుర్తు తెలియని లింక్‌లపై క్లిక్ చేయవద్దని ఆదాయపు పన్ను శాఖ తెలిపింది. అలాంటి మెస్సేజ్‌లు మిమ్మల్ని మోసానికి గురి చేస్తాయని పేర్కొంది. ఒక్క క్లిక్‌తో పెద్ద మోసంలో చిక్కుకొనే అవకాశాలు ఉంటాయని హెచ్చిరించింది. అలాగే తెలియని వ్యక్తి నుంచి ఉద్యోగం సాధించాలనే ఆశలు కూడా పెట్టుకోవద్దని చెప్పింది. అలాంటి వ్యక్తులు మీ నుంచి డబ్బు డిమాండ్ చేసి ఆపై పారిపోతారని తెలిపింది. అందువల్ల ఏదైనా చేసేముందు పూర్తి సమాచారాన్ని తెలుసుకోవడం అలవాటు చేసుకోవాలని సూచించింది.


Show Full Article
Print Article
Next Story
More Stories