Coronavirus: పాకిస్తాన్‌ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌కు కరోనా

Coronavirus: కరోనా వ్యాక్సిన్ తొలి డోసు వేయించుకున్నపాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ తాజాగా కరోనా బారినపడ్డారు.

Arun Chilukuri
Published on: 20 March 2021 9:25 PM IST
Coronavirus: పాకిస్తాన్‌ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌కు కరోనా
X

Coronavirus: కరోనా వ్యాక్సిన్ తొలి డోసు వేయించుకున్నపాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ తాజాగా కరోనా బారినపడ్డారు. రెండురోజుల క్రితమే ఇమ్రాన్‌ చైనా వ్యాక్సిన్‌ వేయించుకున్నారు. ప్రధాని ప్రస్తుతం సెల్ఫ్ ఐసోలేషన్‌లో ఉన్నట్టు పాక్‌ వైద్యశాఖ తెలిపింది. మరోవైపు, పాకిస్థాన్‌లో కరోనా వైరస్ కేసుల సంఖ్య ఆందోళనకర స్థాయిలో పెరిగిపోతున్నాయి. చైనా వ్యాక్సిన్‌ వేయించుకున్న తర్వాత ప్రధానికే కరోనా సోకడంతో పాకిస్తాన్‌లో కలకలం రేగింది. పాక్‌లో ఇప్పటి వరకు మొత్తం 6,23,135 కేసులు నమోదయ్యాయి. మొత్తం 13,799 మరణించారు. ఇంకో 2,122 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్టు వైద్యశాఖ అధికారులు ప్రకటించారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story