Ashwini Vaishnaw: 2024 కల్లా దేశవ్యాప్తంగా 5జీ టెక్నాలజీ అమలు

Ashwini Vaishnaw: సూచనప్రాయంగా వెల్లడించిన కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్

Dhatripriya
Updated on: 28 Feb 2023 2:06 PM IST
Implementation Of 5G Technology Across The Country By 2024
X

Ashwini Vaishnaw: 2024కల్లా దేశవ్యాప్తంగా 5జీ టెక్నాలజీ అమలు

Ashwini Vaishnaw: రాబోయే వర్షాకాల సెషన్‌లో టెలికాం బిల్లును ఆమోదించడమే ప్రభుత్వ తదుపరి ప్రధాన లక్ష్యమన్నారు కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్. ఇది స్పెక్ట్రమ్, లైసెన్స్‌ల నియంత్రణ పరంగా పెద్ద సంస్కరణలకు దారి తీస్తుందని తెలిపారు. టెలికాం బిల్లుతో గణనీయమైన సంస్కరణ ఉంటుందన్నారు కేంద్రమంత్రి. వచ్చే ఏడాదికల్లా 5జీ టెక్నాలజీని దేశవ్యాప్తంగా అందుబాటులోకి తెస్తామని అశ్విని వైష్ణవ్ హామీ ఇచ్చారు. భారతదేశంలో రూపొందించిన మొదటి ఈనోడ్‌ బీని నిన్న చండీగఢ్‌లో ఇన్‌స్టాల్ చేశామన్నారు. కేంద్ర ప్రభుత్వ సైబర్ సెక్యూరిటీ వింగ్‌లన్నీ దీనిపై పనిచేస్తున్నాయని తెలిపారు. భారతదేశ భద్రతకు ఎలాంటి ముప్పు వచ్చినా మనం ఎదుర్కోగలగాలని వైష్ణవ్ సూచించారు.

Dhatripriya

Dhatripriya

Next Story