Mumbai Rains: ముంబయికి మరోసారి రెడ్‌ అలర్ట్‌.. విద్యాసంస్థలకు సెలవు

Mumbai Rains: ముంబైను వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. ఇప్పటికే జోరుగా వానలు పడుతుండగా వాతావరణ శాఖ మరోసారి రెడ్ అలర్ట్ ప్రకటించింది.

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 25 July 2024 3:36 PM IST
IMD that there is a chance of heavy rains in Telangana and Andhra Pradesh for the next 5 days
X

Rain Alert: తెలుగు రాష్ట్రాలకు భారీ వర్షసూచన...హైదరాబాద్‎లో కుండపోత

Mumbai Rains: ముంబైను వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. ఇప్పటికే జోరుగా వానలు పడుతుండగా వాతావరణ శాఖ మరోసారి రెడ్ అలర్ట్ ప్రకటించింది. మహారాష్ట్రలోని కొంకణ్‌లో అత్యంత భారీ వర్షపాతం కురవొచ్చని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఈ మేరకు రెడ్ అలర్ట్‌ను జారీ చేసింది.

థానే, పాల్ఘర్, పూణే, కొల్హాపూర్, సతారా, రాయ్‌గఢ్, రత్నగిరికి ఆరెంజ్ అలర్ట్‌ను జారీ చేశారు. వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ ప్రకటించడంతో బృహణ్ ముంబై మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలోని విద్యాసంస్థలకు అధికారులు సెలవు ప్రకటించారు. పరిస్థితిని మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రులు దేవేంద్ర ఫడ్నవీస్, అజిత్ పవార్‌లు సమీక్షించారు.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story