Delhi: ఢిల్లీకి భారీ వర్ష సూచన.. ఎల్లో అలర్ట్‌ జారీచేసిన ఐఎండీ.. ఇప్పటికే వరద గుప్పిట్లో ఢిల్లీ

IMD Has Issued A Yellow Alert For Heavy Rain Forecast For Delhi
x

Delhi: ఢిల్లీకి భారీ వర్ష సూచన.. ఎల్లో అలర్ట్‌ జారీచేసిన ఐఎండీ.. ఇప్పటికే వరద గుప్పిట్లో ఢిల్లీ

Highlights

Delhi: వరద ముప్పు లేకుండా ఢిల్లీ ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని సీఎం అరవింద్ కేజ్రీవాల్ తెలిపారు

Delhi: ఢిల్లీలో వర్షాలు తగ్గడం లేదు. వర్షాల ధాటికి సెంట్రల్ ఢిల్లీ వరకు వరద నీరు వచ్చి చేరుకుంది. రాజ్‌ఘాట్‌తో పాటు తిలక్​మార్గ్‌లోని సుప్రీం కోర్టు ఎంట్రెన్స్‌ను వరద తాకింది. ఈ క్రమంలో ఢిల్లీకి భారత వాతావరణ శాఖ మరో హెచ్చరిక జారీ చేసింది. రాబోయే 4 -నుంచి 5 రోజుల పాటు ఉరుములతో కూడిన తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. జూలై 18 తరువాత వర్షాలు పెరుగుతాయని పేర్కొంది.

వరద ముప్పు లేకుండా ఢిల్లీ ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని సీఎం అరవింద్ కేజ్రీవాల్ తెలిపారు. ఢిల్లీలోని యమునా నది నీటిమట్టం ప్రమాదకర స్థాయికి నుంచి ఇంకా తగ్గకపోవడంతో పరిసర ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు.

ఇంద్రప్రస్థా వాటర్ రెగ్యులేటర్ రిపేరింగ్ వర్క్స్‌ను పరిశీలించిన కేజ్రీవాల్ అక్కడి అధికారులతో మాట్లాడారు. డిజాస్టర్ మేనేజ్​మెంట్ డిపార్ట్​మెంట్ సాయం తీసుకుని రెగ్యులేటర్‌‌ను సరి చేసేందుకు ట్రై చేశామన్నారు. దీనికోసం ఇంజినీర్ టీమ్ రాత్రంతా ప్రయత్నించినా.. ప్రయోజనం లేకపోయిందని వివరించారు.

అందుకే ఆర్మీ, ఎన్​డీఆర్ఎఫ్ సాయం కోరాల్సిందిగా సీఎస్​ను ఆదేశించానన్నారు. ఇంద్రప్రస్థ బస్ డిపో నుంచి డబ్ల్యూహెచ్‌‌వో బిల్డింగ్‌‌ మధ్య ఉండే డ్రెయిన్‌‌ రెగ్యులేటర్ పాడవ్వడంతోనే సెంట్రల్ ఢిల్లీలోకి వరద చేరిందన్నారు. రెగ్యులేటర్ రిపేర్‌కే ప్రాధాన్యత ఇస్తున్నామని ఇరిగేషన్ మినిస్టర్ సౌరభ్ భరద్వాజ్ తెలిపారు. ఎన్​డీఆర్ఎఫ్ టీమ్స్​ను ఇవ్వకపోవడంతోనే ఇలా జరిగిందని కేంద్రాన్ని విమర్శించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories