జులై 3న ఐఐటీ జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్ష
ఐఐటీ జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్ష 2021 తేదీని కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేశ్ పోఖ్రియాల్ ప్రకటించారు. జులై 3న ఎగ్జామ్ నిర్వహించనున్నట్టు వెల్లడించారు. ఈసారి ఐఐటీ ఖరగ్‌పూర్ పరీక్షను నిర్వహిస్తుందని మంత్రి తెలిపారు. పరీక్ష రాసే అభ్యర్థులకు ప్రిపరేషన్ కోసం తగిన సమయం ఉందన్న ఆయన ఈ సందర్భంగా విద్యార్థులు, తల్లిదండ్రులకు ఆల్ ద బెస్ట్ చెప్పారు. జేఈఈ మెయిన్ పరీక్షల తేదీలు, సీబీఎస్‌ఈ 10, 12వ తరగతి పరీక్షల ప్రారంభం, ముగింపు తేదీలను ఇప్పటికే ఆయన ప్రకటించారు.
Next Story




