New Rules: బిగ్ అలర్ట్.. అక్టోబర్ 1 నుంచి కొత్త రూల్స్.. ఏ డాక్యుమెంట్ కావాలన్న ఈ సర్టిఫికేట్ ఉండాల్సిందే..!

IF you Want Licence, Aadhaar and Voter Cards Must Produce Birth Certificate From October 1st
x

New Rules: బిగ్ అలర్ట్.. అక్టోబర్ 1 నుంచి కొత్త రూల్స్.. ఏ డాక్యుమెంట్ కావాలన్న ఈ సర్టిఫికేట్ ఉండాల్సిందే..!

Highlights

Birth Certificate: అక్టోబర్ 1 నుంచి డాక్యుమెంట్ వెరిఫికేషన్‌లో జనన ధృవీకరణ పత్రం ప్రాధాన్యత పెరగనుంది.

Birth Certificate: అక్టోబర్ 1 నుంచి డాక్యుమెంట్ వెరిఫికేషన్‌లో జనన ధృవీకరణ పత్రం ప్రాధాన్యత పెరగనుంది. కొత్త నిబంధన ప్రకారం స్కూల్ అడ్మిషన్, డ్రైవింగ్ లైసెన్స్, ఓటర్ ఐడీ, వివాహ నమోదు, ప్రభుత్వ ఉద్యోగం, పాస్‌పోర్ట్, ఆధార్‌తో సహా అనేక ప్రదేశాలలో జనన ధృవీకరణ పత్రాన్ని ఒకే పత్రంగా ఉపయోగించవచ్చు.

జనన మరణాల నమోదు (సవరణ) బిల్లు 2023 వర్షాకాల సమావేశాల్లో పార్లమెంటు ఉభయ సభల్లో ఆమోదం పొందింది. దీనికి రాష్ట్రపతి ఆమోదం కూడా లభించింది. అక్టోబరు 1 నుంచి దీన్ని అమలు చేయనున్నారు.

నమోదైన జనన, మరణాల జాతీయ, రాష్ట్ర స్థాయి డేటా బేస్‌ను రూపొందించడంలో కూడా కొత్త చట్టం సహాయపడుతుంది. దీంతో ప్రజాసేవలు మరింత మెరుగైన రీతిలో అందజేయవచ్చు. అక్టోబరు 1న లేదా ఆ తర్వాత వచ్చిన జనన ధృవీకరణ పత్రాలకు ఈ కొత్త నిబంధన వర్తిస్తుంది.

డిజిటల్ జనన, మరణ ధ్రువీకరణ పత్రం..

చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత జనన, మరణ ధృవీకరణ పత్రాలు కూడా డిజిటల్‌గా అందుబాటులోకి రావడమే అతిపెద్ద మార్పు. ప్రస్తుతం దాని హార్డ్ కాపీ మాత్రమే అందుబాటులో ఉంది. దీని కోసం కూడా చాలా రోజులు కార్యాలయాలకు వెళ్లాల్సి వస్తోంది.

ఆధార్ కార్డు మాదిరిగానే జనన-మరణ ధృవీకరణ పత్రాన్ని ఉపయోగిస్తారా?

ఇప్పటి వరకు గుర్తింపు కార్డుగా ప్రతిచోటా ఆధార్‌నే ఉపయోగిస్తున్నారు. ఇది మీ ఇతర పత్రాలు, ఖాతాలకు లింక్ చేస్తుంటారు. అదేవిధంగా, ఇది జనన-మరణ ధృవీకరణ పత్రం కూడా ఇకనుంచి కీలకం కానుంది. ఇది జనన, మరణ రుజువు కోసం ప్రతిచోటా విశ్వవ్యాప్తంగా ఆమోదించబడిన గుర్తింపు కార్డుగా పని చేయనుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories