లాక్‌డౌన్‌ ఆంక్షలు సడలిస్తే కోవిడ్ సమూహ వ్యాప్తి ముప్పు

లాక్‌డౌన్‌ ఆంక్షలు సడలిస్తే కోవిడ్ సమూహ వ్యాప్తి ముప్పు
x
Highlights

భారత్‌లో లాక్‌డౌన్‌ ఆంక్షలు క్రమంగా సడలిస్తే కరోనా వైరస్‌ సమూహ వ్యాప్తి చెందే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

భారత్‌లో లాక్‌డౌన్‌ ఆంక్షలు క్రమంగా సడలిస్తే కరోనా వైరస్‌ సమూహ వ్యాప్తి చెందే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.దేశంలోని కొన్ని ప్రాంతాల్లో వైరస్‌ మూడో దశలో ఉందని కొందరు నిపుణులు భావిస్తున్నారు.

ఇప్పటి వరకు కేసులను గమనిస్తే ప్రయాణాలకు సంబంధంలేనివి కనిపిస్తున్నాయని భారత ప్రజారోగ్య స్వచ్ఛంద సంస్థ అధ్యక్షుడు ప్రొఫెసర్‌, డాక్టర్‌ కె.శ్రీనాథరెడ్డి అభిప్రాయపడ్డారు. చాలావరకు ప్రభుత్వం విదేశాల నుంచి తిరిగొచ్చిన వారిపైనే దృష్టిపెట్టాయని చెప్పరు. ప్రస్తుతం వైరస్‌ వ్యాప్తి రెండో దశలో ఉందని వారు స్థానిక వ్యాప్తిని గుర్తించగలుగుతున్నామని అన్నారు. అందుకే సమూహ వ్యాప్తి అనేదీ ఉపయోగించడం లేదని చెప్పారు. ఏదేమైనప్పటికీ భారత్‌కు సమూహవ్యాప్తి ముప్పు పొంచిఉందని ఆయన హెచ్చరించారు.

కొవిడ్‌-19 మరణాల రేటును భారత్‌, మలేసియా సహా నైరుతి ఆసియా దేశాలు తగ్గించాయని ఆయన అభిప్రాయపడ్డారు. ఎక్కువ యువత, గ్రామీణ జనాభా, ఉష్ణోగ్రత, వాతావరణం, వైరస్‌ వ్యాప్తి నిరోధక చర్యలు, లాక్‌డౌన్‌ వంటి చర్యలతో తక్కువ మరణాలు చోటుచేసుకున్నాయని శ్రీనాథ్ అభిప్రాపడ్డారు. ఆంక్షలు సడలించినా వైరస్‌ వ్యాప్తి చెందకుండా భౌతిక దూరం, మాస్క్‌లు, తరచూ చేతులు శుభ్రం చేసుకోవడం కొనసాగించాలని సూచించారు. పెద్ద నగరాల్లోనే వైరస్‌ వ్యాప్తి ఉందని పేర్కొన్నారు. వలస కార్మికులు వైరస్‌ బాధితులు కాకుండా చూసుకోవాలని శ్రీనాథ్ సూచించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories