Plasma Therapy: ప్లాస్మా థెరపీపై కీలక నిర్ణయం ప్రకటించనున్న ఐసీఎంఆర్

Plasma Therapy: ప్లాస్మా థెరపీపై కీలక నిర్ణయం ప్రకటించనున్న ఐసీఎంఆర్
Plasma Therapy: కరోనా చికిత్సలో ప్లాస్మా థెరపీతో ప్రయోజనం శూన్యమా ప్లాస్మా థెరపీ ప్రాణంతాక వ్యాధిని కంట్రోల్ చేయడం లేదా ప్లాస్మా థెరపీ సమర్థతపై సందేహాలు ఎందుకు వస్తున్నాయి.
Plasma Therapy: కరోనా చికిత్సలో ప్లాస్మా థెరపీతో ప్రయోజనం శూన్యమా ప్లాస్మా థెరపీ ప్రాణంతాక వ్యాధిని కంట్రోల్ చేయడం లేదా ప్లాస్మా థెరపీ సమర్థతపై సందేహాలు ఎందుకు వస్తున్నాయి. వైద్యుల ఫిర్యాదులపై ఐసీఎంఆర్ ఎలాంటి నిర్ణయం తీసుకోనుంది. ప్లాస్మా థెరపీ పనికి రాదని తేల్చేస్తుందా లేదంటే సరైనదే అంటూ సర్టిఫికెట్ ఇస్తుందా ఇప్పుడు అందరి దృష్టి ఐసీఎంఆర్ మీటింగ్‌పైనే ఉంది.
ప్లాస్మా థెరపీ కరోనా మరణాల రేటును తగ్గించడం లేదని ఐసీఎంఆర్ అధ్యయనంలో తేలింది. 39 ట్రయల్ సెంటర్లలో 464 కోవిడ్ పేషెంట్లలో ప్రవేశపెట్టి పరీక్షించారు. ఎలాంటి ప్రయోజనం లేకపోవడంతో ప్లాస్మా థెరపీ సామర్థ్యంపై సందేహాలు వినిపిస్తున్నాయి. పైగా 18 మంది వైద్యులు, శాస్త్రవేత్తలు, ప్రజారోగ్య నిపుణుల బృందం ఇటీవల ప్రభుత్వానికి లేఖ రాసింది. ప్లాస్మా థెరపీ సార్స్-కోవ్ -2 వైరస్ జాతులను పెంచడానికి సహకరిస్తుందని ఆరోపించారు. దీంతో వైరస్ మరింత బలపడే చాన్స్ ఉందని అంటున్నారు. మరోవైపు ప్లాస్మా చికిత్స మార్గదర్శకాలు శాస్త్రీయంగా లేవని నిరూపిస్తున్న పలు అధ్యయనాలను నిపుణులు ఈ లేఖలో ప్రస్థావించారు.
కరోనా సెకండ్ వేవ్‌లో కేసుల సంఖ్య విపరీతంగా పెరిగింది. రోగుల బంధువుల అభ్యర్థనలతో ప్లాస్మాకు అదే స్థాయిలో డిమాండ్ పెరిగింది. కోవిడ్ నుంచి కోలుకున్న వ్యక్తులు నిర్దిష్ట సమయం తర్వాత ప్లాస్మా దానం చేయడానికి ముందుకు వస్తున్నారు. అయితే ప్లాస్మా థెరపీ కారణంగా వైరస్‌లో ఉత్పరివర్తనాలు వచ్చే ముప్పుంటుందని ఐసీఎంఆర్ మాజీ సైంటిస్ట్ డాక్టర్ రమణ్ గంగాఖేడ్కర్ ఆరోపిస్తున్నారు. ఈ ఆరోపణల నేపథ్యంలో ప్లాస్మా థెరపీపై ఐసీఎంఆర్ నేడు అత్యవసరంగా భేటీ కానుంది. ప్లాస్మా చికిత్సపై జరిగిన అధ్యయనాలను పరిశీలించి కీలక నిర్ణయం తీసుకోనున్నారు.
పెళ్లి కాలేదని నమ్మించి రెండో పెళ్లి.. మొదటి భార్య పాత్ర..
25 Jun 2022 9:49 AM GMTతండ్రికి తలకొరివి పెట్టిన కూతురు
25 Jun 2022 7:28 AM GMTప్రొడ్యూసర్ బండ్ల గణేశ్ ఇంటికి వెళ్లిన రేవంత్ రెడ్డి
25 Jun 2022 5:43 AM GMTCM Jagan: సీఎం అధ్యక్షతన ఏపీ కేబినెట్ భేటీ ప్రారంభం
24 Jun 2022 6:43 AM GMTకేరళ గోల్డ్ స్మగ్లింగ్ కేసుపై రాజకీయ దూమారం.. అసలు ఎవరీ స్వప్న సురేష్?
23 Jun 2022 11:15 AM GMTసికింద్రాబాద్ అల్లర్ల కేసులో కీలక పరిణామం.. విధ్వంసం రోజు..
23 Jun 2022 10:41 AM GMTAfghanistan: ఆఫ్ఘనిస్తాన్లోని పక్టికా రాష్ట్రంలో భారీ భూకంపం
22 Jun 2022 10:01 AM GMT
కేంద్రంపై వైసీపీ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు గౌతం రెడ్డి ఫైర్
26 Jun 2022 8:14 AM GMTహైదారబాద్‌లో తల్వార్, కత్తులతో యువకుల హంగామా
26 Jun 2022 7:43 AM GMTMekapati Vikram Reddy: ఆత్మకూరు ఉప ఎన్నికలో వైసీపీ ఘన విజయం
26 Jun 2022 7:19 AM GMTఎల్ బీనగర్ నియోజకవర్గంలో సామ రంగారెడ్డి పర్యటన
26 Jun 2022 6:51 AM GMTBandi Sanjay: జాతీయ మానవ హక్కుల కమిషన్‌కు బండి సంజయ్ ఫిర్యాదు
26 Jun 2022 6:35 AM GMT