హైదరాబాద్‌పై మాజీ గవర్నర్ విద్యాసాగర్ రావు ఆసక్తికర వ్యాఖ్యలు

హైదరాబాద్‌పై మాజీ గవర్నర్  విద్యాసాగర్ రావు ఆసక్తికర వ్యాఖ్యలు
x
Highlights

బీజేపీ సీనియర్ నేత మహారాష్ట్ర మాజీ గవర్నర్ విద్యాసాగర్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ దేశానికి రెండో రాజధాని కావచ్చునని ఆసక్తికర ఆయన వ్యాఖ్యలు చేశారు.

బీజేపీ సీనియర్ నేత మహారాష్ట్ర మాజీ గవర్నర్ విద్యాసాగర్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ దేశానికి రెండో రాజధాని కావచ్చునని ఆసక్తికర ఆయన వ్యాఖ్యలు చేశారు. దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం తీవ్ర స్థాయికి చెరిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అక్కడ ప్రభుత్వం సీఎం కాన్వాయ్ తో సహా అన్ని వాహనాలకు సరి-బేసి విధానాన్ని విధించింది. కోర్టు సైతం కాలుష్య నియంత్రణకు చర్యలు తీసుకోవాలని ఆదేశించిన సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలో మాజీ గవర్నర్ విద్యాసాగర్ రావు వ్యాఖ్యల పట్ల ఆసక్తి నెలకొంది. తెలుగు యూనివర్సిటీలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ శ్రీధర్ రెడ్డి రచించిన కవితా పుస్తకం "శ్రీధర్ కవితా ప్రస్థానం" ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. అంబేద్కర్ కోరిన విధంగా దేశానికి రెండో రాజధాని హైదరాబాద్ అవుతుందేమో అని విద్యాసాగర్ రావు అన్నారు.

రాష్ట్ర విభజన సమయంలో హైదరాబాద్‌ను కేంద్ర పాలిత ప్రాంతం డిమాండ్ చేశారు. లేదా గ్రేటర్ హైదరాబాద్ తో కూడిన రాయాలసీమను ఏర్పాటు చేయాలని కోరారు. అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం హైదరాబాద్ ను తెలంగాణలో కూడిన రాష్ట్రంగా ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. అయితే బీజేపీ సీనియర్‌ నేత, మాజీ గవర్నర్ విద్యాసాగర్ రావు చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లోనూ చర్చనీయంశంగా మారింది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories