జార్ఖండ్‌ కాల్పుల్లో హైదరాబాద్‌ వాసి మృతి.. బ్యాంక్‌ పనిపై వాహనంలో వెళ్తుండగా

Jharkhand: విధుల్లో భాగంగా వెళుతుండగా కాల్పులు జరిపిన నక్సలైట్లు

Dhatripriya
Published on: 10 May 2023 10:56 AM IST
Hyderabad Man Died Jharkhand Shooting Incident
X

జార్ఖండ్‌ కాల్పుల్లో హైదరాబాద్‌ వాసి మృతి.. బ్యాంక్‌ పనిపై వాహనంలో వెళ్తుండగా

Jharkhand: జార్ఖండ్‌లో హైదరాబాద్‌కు చెందిన వ్యక్తిని నక్సలైట్లు కాల్చిచంపారు. హైదరాబాద్ కొత్తపేట్‌కు చెందిన సన్ షైన్ అపార్ట్‌మెంట్‌లో వీ.శరత్ బాబు నివాసం ఉంటున్నారు. ఏపీకి చెందిన రాజ్యసభ సభ్యుడు సీఎం రమేశ్‌కు చెందిన కంపెనీలో కాంట్రాక్ట్ మేనేజర్‌గా పనిచేస్తున్నారు. గతంలో ఒరిస్సాలో జరిగిన ప్రాజెక్టు వర్క్‌లో సైతం శరత్ బాబు పనిచేశారు. కాంట్రాక్టు వర్క్ విషయమై నాలుగు రోజుల క్రితం జార్ఖండ్ వెళ్లారు. కాంట్రాక్ట్ పనుల్లో భాగంగా వాహనంలో వెళుతుండగా... నక్సలైట్ల అతన్ని కాల్చి చంపారు. శరత్ బాబుకు భార్య, ఒక కొడుకు ఉన్నారు.

Dhatripriya

Dhatripriya

Next Story