మన్‌కీ బాత్‌ కార్యక్రమంలో తెలుగు రైతు ప్రస్తావన

Arun Chilukuri
Updated on: 28 Feb 2021 6:00 PM IST
మన్‌కీ బాత్‌ కార్యక్రమంలో తెలుగు రైతు ప్రస్తావన
X

మన్‌కీ బాత్‌ కార్యక్రమంలో తెలుగు రైతు ప్రస్తావన

హైదరాబాద్‌కు చెందిన చింతల వెంకట్ రెడ్డి అనే రైతు గురించి ప్రధాని మోడీ మన్‌ కీ బాత్‌ కార్యక్రమంలో ప్రస్తావించారు. సంప్రదాయ పద్దతుల్లో వెంకట్‌ రెడ్డి చేస్తున్న వ్యవసాయం గురించి ప్రధాని ప్రశంసించారు. సాగులో వెంకట్ రెడ్డి సృష్టించిన అద్భుతాలను మోడీ వివరించారు. వరి, గోదుమల్లో డీ విటమిన్‌ ఉండేలా వెంకటరెడ్డి ఫార్ములా రూపొందించారని ప్రధాని తెలిపారు. ఈ నెలలోనే వెంకటరెడ్డి పంటకు జెనీవాలోని ప్రపంచ మేధో హక్కుల సంస్థ.. పేటెంట్ హక్కులు కూడా ఇచ్చిందని మోడీ తెలిపారు. అలాంటి వ్యక్తికి గత ఏడాది పద్మ శ్రీ పురస్కారం ఇవ్వడం మా ప్రభుత్వానికి దక్కిన గౌరవమని ప్రధాని కొనియాడారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story