భార్యకు ప్రభుత్వ ఉద్యోగం.. విడిచి వెళ్తుందన్న అనుమానంతో చెయ్యి నరికేసిన భర్త!

Husband Cut Off Wife Hand in West Bengal
x

భార్యకు ప్రభుత్వ ఉద్యోగం.. విడిచి వెళ్తుందన్న అనుమానంతో చెయ్యి నరికేసిన భర్త!

Highlights

West Bengal: ప్రభుత్వ ఉద్యోగం సాధించడం ఈ రోజుల్లో అంత తేలికైన పని కాదు ఉద్యోగం రావడం అంటే ఎంతో అదృష్టం చేసుకొని ఉండాలి.

West Bengal: ప్రభుత్వ ఉద్యోగం సాధించడం ఈ రోజుల్లో అంత తేలికైన పని కాదు ఉద్యోగం రావడం అంటే ఎంతో అదృష్టం చేసుకొని ఉండాలి. ఇంట్లో ఎవరికి ప్రభుత్వ ఉద్యోగం వచ్చినా సంతోషంలో మునిగిపోతారు. కానీ ఓ భర్త మాత్రం తన భార్యకు ప్రభుత్వ ఉద్యోగం వస్తే సంతోషించాల్సింది పోయి కక్ష్య పెంచుకున్నాడు. ప్రభుత్వ ఉద్యోగం రావడంతో తన భార్య తనను విడిచి వెళ్లిపోతుందేమోనని అనుమానం పెంచుకున్నాడు. చివరికి ఆమె చేయిని నరికేశాడు.

ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళ్తే.. పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రంలోని తూర్పు బర్ధమాన్ జిల్లా కోజల్సా గ్రామానికి చెందిన షేర్ మహమ్మద్-రేణు ఖాతున్ భార్యాభర్తలు. దుర్గాపూర్‌లోని ఓ ప్రైవేటు నర్సింగ్ హోంలో నర్సింగ్‌లో శిక్షణ పొందుతున్న రేణు ఇటీవల ప్రభుత్వ ఉద్యోగం సాధించింది. మరోవైపు, రేణు ఉద్యోగం చేయడం భర్త షేర్‌ మహమ్మద్‌కు ఇష్టం లేదు. దీంతో దంపతుల మధ్య గొడవలు మొదలయ్యాయి. ఈ క్రమంలో షేర్‌ మహమ్మద్‌ పదునైన ఆయుధంతో భార్య కుడి చేయిని నరికేశాడు. ఆపై పరారయ్యాడు. వెంటనే ఆమెను ఆసుపత్రిలో చేర్చగా వైద్యులు చేయిని మొత్తం తొలగించి చికిత్స అందిస్తున్నారు. పరారీలో ఉన్న నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories