Punjab: ఎమ్మెల్యేను కొట్టిన భర్త.. రంగంలోకి మహిళా కమిషన్‌

Punjab AAP MLA Slaps Her Wife
x

Punjab: ఆప్ పంజాబ్ ఎమ్మెల్యే బల్జిందర్ కౌర్‌ను కొట్టిన భర్త

Highlights

Punjab: ఎమ్మెల్యే బల్జిందర్ కౌర్‌కు, భర్తకు మధ్య వాగ్వాదం

Punjab: మహిళలపై నేరాలు దారుణంగా పెరిగిపోతున్నాయని జాతీయ నేర గణాంకాల బ్యూరో రెండు రోజుల క్రితమే ఓ నివేదిక విడుదల చేసింది. పంజాబ్‌లో కూడా మహిళలపై నేరాలు 17 శాతం పెరిగినట్లు పేర్కొంది. ఆ నివేదికపై చర్చ జరుగుతుండగానే ఓ మహిళా ఎమ్మెల్యేపై ఆమె భర్త దాడి చేసిన ఘటన పంజాబ్‌లో జరిగింది. అందరూ చూస్తుండగానే పంజాబ్‌లో ఆప్ ఎమ్మెల్యే బల్జిందర్ కౌర్‌పై ఆమె భర్త చేయి చేసుకున్నారు. ఆమె ఇంట్లో జరిగిన ఈ గొడవకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఘటనపై పంజాబ్ మహిళా కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనిని సుమోటోగా స్వీకరించి చర్యలు తీసుకుంటామని చైర్ పర్సన్ మనీషా గులాటి తెలిపారు. ప్రజా సమస్యలపై పోరాడే ఓ మహిళ ఇంట్లో వేధింపులకు గురికావడం బాధాకరమని అన్నారు.


Show Full Article
Print Article
Next Story
More Stories