Gujarat New CM: గుజరాత్ కొత్త ముఖ్యమంత్రి ఎంపికపై అధిష్టానం ఫోకస్

Gujarat New CM: *రాత్రికి అహ్మదాబాద్‌లో బీజేపీ శాసనసభాపక్ష సమావేశం *కొత్త ముఖ్యమంత్రిని ఎన్నుకోనున్న బీజేపీ ఎమ్మెల్యేలు

Shireesha
Updated on: 11 Sept 2021 9:00 PM IST
Home Minister Amit Shah Focus on Gujarat New CM Election | National Politics
X

గుజరాత్ కొత్త ముఖ్యమంత్రి ఎంపికపై అధిష్టానం ఫోకస్

Gujarat New CM: గుజరాత్ కొత్త ముఖ్యమంత్రి ఎంపికపై బీజేపీ అధిష్టానం ఫోకస్ చేసింది. ఇవాళ రాత్రికి అహ్మదాబాద్‌లో బీజేపీ శాసనసభాపక్ష సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో గుజరాత్ కొత్త ముఖ్యమంత్రిని ఎమ్మెల్యేలు ఎన్నుకోనున్నారు. రాత్రికి అహ్మదాబాద్ చేరుకోనున్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా.. శాసనసభాపక్ష సమావేశానికి హాజరుకానున్నారు.

మరోవైపు.. గుజరాత్ తదుపరి ముఖ్యమంత్రిగా కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవీయ పేరు బలంగా వినిపిస్తోంది. మన్‌సుఖ్ మాండవీయతో పాటు సీఆర్ పటేల్, నితిన్ పటేల్, ఆర్‌సీ ఫల్దూ పేర్లు కూడా బలంగా వినిపిస్తున్నాయి. మన్‌సుఖ్ మాండవీయ పేరు బలంగా వినిపిస్తున్నప్పటికీ.. పటేల్ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తికి పదవి దక్కే ఛాన్స్ కనిపిస్తోంది. గత ఎన్నికల్లో బొటాబొటీ మెజారిటీతో గట్టెక్కిన బీజేపీ ఈసారి బలమైన సామాజిక వర్గం పటేళ్లను దగ్గర చేసుకునే ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది. హార్ధిక్ పటేల్‌కు ధీటుగా మరో వ్యక్తిని ముఖ్యమంత్రి పీఠం ఎక్కించనుందనే వార్తలు బలంగా వినిపిస్తున్నాయి.

Shireesha

Shireesha

Next Story