ఎయిమ్స్‌ నుంచి అమిత్‌ షా డిశ్చార్జ్‌

Arun Chilukuri
Published on: 31 Aug 2020 11:42 AM IST
ఎయిమ్స్‌ నుంచి అమిత్‌ షా డిశ్చార్జ్‌
X

Amit Shah: కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఎయిమ్స్ నుంచి డిశ్చార్జ్‌ అయ్యారు. కరోనాను జయించిన అనంతరం అనారోగ్య కారణాలతో ఢిల్లీలోని ఎయిమ్స్‌లో చేరిన ఆయన, ప్రస్తుతం కోలుకున్నట్లు ఆస్పత్రి వర్గాలు ఓ ప్రకటనలో వెల్లడించాయి. ఆగస్టు 2న అమిత్ షాకు కరోనా సోకగా గురుగ్రామ్‌లోని వేదాంత ఆస్పత్రిలో చేరి చికిత్స పొందారు. ఆ తర్వాత 14వ తేదీన ఆయనకు కరోనా నెగిటివ్ రాగా ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఈ క్రమంలో హోం ఐసోలేషన్‌లో ఉన్న అమిత్ షాకు శ్వాసకోశ సమస్య, తదితర అనారోగ్య పరిస్థితలు తలెత్తడంతో 18న ఢిల్లీలోని ఎయిమ్స్‌లో చేరారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం మెరుగుపడడంతో సోమవారం ఉదయం డిశ్చార్జి చేసినట్లు ఎయిమ్స్‌ వర్గాలు వెల్లడించాయి. తాజాగా, ఓనమ్‌ సందర్భంగా కేంద్రమంత్రి అమిత్‌షా ట్విటర్‌లో శుభాకాంక్షలు తెలిపారు.




Arun Chilukuri

Arun Chilukuri

Next Story