Tamil Nadu: తమిళనాడులో జోరుగా అసెంబ్లీ ఎన్నికల ప్రచారం

Tamil Nadu: కుష్బు తరుపున కేంద్ర హోంమంత్రి అమిత్‌షా ప్రచారం

Sandeep Eggoju
Published on: 3 April 2021 12:52 PM IST
Home Minister Amit Shah campaigned on behalf of BJP candidate Khushboo Sundar
X
ఫోటో : కుష్బూ సుందర్ ట్విట్టర్ 

Tamil Nadu: తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం జోరుగా కొనసాగుతోంది. అన్ని పార్టీల అగ్రనేతలు రంగంలోకి దిగి ప్రజలను ఓట్లు అడుగుతున్నారు. కేంద్రం హోంమంత్రి అమిత్‌షా సినీ నటి, బీజేపీ అభ్యర్థి కుష్బూ సుందర్ తరుపున ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కుష్బు పోటీ చేస్తున్న థౌజెండ్ లైట్స్ అసెంబ్లీ నియోజకవర్గంలో అమిత్‌ షా నిర్వహించారు. ఈ రోడ్ షో కు బీజేపీ కార్యకర్తలు భారీగా తరలివచ్చారు.

తమిళనాడులో పర్యటిస్తున్న కేంద్ర హోంమత్రి ప్రధాన ప్రతిపక్షమైన డీఎంకే- కాంగ్రెస్ కూటమిపై నిప్పులు చెరిగారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే వారసత్వ రాజకీయాలను ప్రోత్సహించే అవినీతిమయ డీఎంకే- కాంగ్రెస్ కూటమిని మరోసారి ఓడించాలని ఆయన ఓటర్లకు పిలుపునిచ్చారు. ప్రధాని మోడీ నాయకత్వంలో జరుగుతున్న అభివృద్ధి పనులతో తమిళనాడులో ఎంజీఆర్, జయలలిత కలలు నెరవేరతాయన్నారు.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story